India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తాము విశాఖను వాణిజ్య రాజధాని చేస్తే.. వైసీపీ నేతలు గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్‌గా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘సీఎం జగన్‌కు వైజాగ్‌పై ప్రేమ లేదు.. ఆయనకు ఆస్తుల మీదే ప్రేమ ఉంది. ఈ ప్రాంతంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారు. నేను విశాఖకు అదానీ డేటా సెంటర్, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ తెస్తే వైసీపీ నేతలు తరిమేశారు. వాళ్లు భూకబ్జాలు చేశారు’ అని ఆరోపించారు.
TG: శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాప్స్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉ.6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
AP: వైఎస్ జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సజ్జల డైరెక్షన్‌లో జగన్ నటిస్తున్నారు. గత ఎన్నికల్లో గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఈసారి గులకరాయి డ్రామా ఫెయిలైంది. ఇప్పుడు ఎవరైనా బలికావొచ్చు. ముందుజాగ్రత్తతోనే విజయమ్మ అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకు రానంటున్నారు’ అని పేర్కొన్నారు.
AP: రాయి దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘సీఎం భద్రతలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేయాలి. సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే రాయి విసిరిందెవరో తెలుస్తుంది. ప్రధాని పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి. ఈ విషయంపై ECI దృష్టి పెట్టాలి’ అని ట్వీట్ చేశారు.
స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మదుపర్ల రూ.5లక్షల కోట్లు ఆవిరైపోయాయి. సెన్సెక్స్ 845 పాయింట్ల నష్టంతో 73,399 వద్ద ముగియగా.. నిఫ్టీ 249 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5లక్షల కోట్లు క్షీణించి రూ.394 లక్షల కోట్లకు చేరింది.
TG: భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు. కళ్యాణం లైవ్‌కు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. కాగా, ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
AP: పరీక్షా ఫలితాలు ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేశాయి. కృష్ణా(D) గుడివాడలో అక్కాచెల్లెళ్లు సూసైడ్‌కు పాల్పడ్డారు. పెద్ద అమ్మాయి(18) బీటెక్ సెమ్ పరీక్షల్లో పాస్ కాలేదు. చిన్న అమ్మాయి(17) ఇంటర్ సెంకడియర్‌లో ఓ సబ్జెక్ట్ తప్పింది. రైతు అయిన తండ్రి కష్టపడి చదివిస్తున్నారని, పరీక్షల్లో తప్పామని తెలిస్తే ఏమంటారోననే భయంతో ఇద్దరూ విష ద్రావకం తాగారు. చిన్నపాప చనిపోగా పెద్దమ్మాయి మృత్యువుతో పోరాడుతోంది.
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. జులై నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. సగటు వర్షపాతం 106శాతం కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాలకూ వర్షపాతం పుష్కలంగా ఉంటుందని పేర్కొంది.
‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన తేజా సజ్జ హీరోగా ‘సూపర్ యోధ’ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఏప్రిల్ 18న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మంచు మనోజ్ విలన్‌గా, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
నిన్న CSK చేతిలో MI ఓటమికి హార్దిక్ పాండ్యనే కారణమని అభిమానులు ఫైరవుతున్నారు. అతని కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ Xలో స్పందిస్తూ.. ‘పాండ్య చివరి ఓవర్‌ను బౌలింగ్ చేయడమనేది ఆకాశ్ మధ్వాల్‌పై అతనికి నమ్మకం లేదనే విషయాన్ని తెలియజేసింది. అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే నైపుణ్యం హార్దిక్‌కు లేదని తేలింది’ అని రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.