News April 15, 2024

1951 నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్థానం..

image

1951: 364 ఎంపీ సీట్లలో గెలుపు(44.99 ఓట్ల శాతం), 1957: 371 సీట్లు(44.78శాతం), 1962:361(44.72%), 1967: 283 సీట్లు (40.78శాతం), 1971:352(43.68 %), 1977: 154(34.52%), 1980:353(42.69%), 1984: 404(49.10%), 1989:197 సీట్లు, 1991: 232 సీట్లు,1996:140 సీట్లు, 1998: 141(25.82%), 1999: 114, 2004: 145, 2009:206(28.55%), 2014:44(19.52%), 2019: 52సీట్లు (19.67శాతం).. 2024..?
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు

image

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్‌ తరుణ్ కార్తికేయన్‌ను ఆమె వివాహమాడారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐశ్వర్య శంకర్ 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

News April 15, 2024

అంతరిక్షం నుంచి వచ్చినా నన్ను ఓడించలేరు: కొడాలి నాని

image

AP: గుడివాడతో సంబంధం లేని వ్యక్తిని తనపై పోటీకి నిలబెట్టారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘ఓటుకు రూ.5వేలు ఇస్తే ప్రజలు ఓటేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. గుడివాడలో మాకు ఓటు బ్యాంకు ఉంది. మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు. నా గెలుపు కోసం వేల మంది పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చినా, అంతరిక్షం నుంచి వచ్చినా నన్ను ఓడించలేరు’ అని నాని ధీమా వ్యక్తం చేశారు.

News April 15, 2024

ఇండిగో సంస్థ నిర్లక్ష్యం.. ప్రయాణికుల ఆగ్రహం

image

అయోధ్య నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికులకు తాజాగా భయానక అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మరో పావుగంటలో ఢిల్లీ చేరుతుందనగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని చండీగఢ్‌కు మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత విమానంలో మరో ఒకట్రెండు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందన్న విషయం ప్రయాణికులకు తెలిసింది. దీంతో వారంతా వణికిపోయారు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ DGCAకి ఫిర్యాదు చేశారు.

News April 15, 2024

గర్ల్‌ఫ్రెండ్ దొరక్క నిరాశపడ్డాడు.. అందుకే హత్య: సిడ్నీ అటాకర్ తండ్రి

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆరుగురిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి <<13044823>>చంపేయడం<<>> సంచలనంగా మారింది. ఈ ఘటనపై నిందితుడు జోయెల్ కౌచీ తండ్రి ఆండ్రూ కౌచీ స్పందించాడు. ‘ఇది చాలా భయంకరం. చనిపోయిన వారిని నేను తీసుకురాలేను. నన్ను క్షమించండి. మీకు అతనొక దుర్మార్గుడు. నాకు మాత్రం మానసిక రోగి. అతడు ఓ గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు. అందుకుతగ్గ నైపుణ్యాలు లేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అందుకే దాడి చేశాడు’ అని తెలిపాడు.

News April 15, 2024

అభిమానుల స్పందనపై హీరోయిన్ ఎమోషనల్

image

‘అమర్ సింగ్ చంకీలా’ మూవీకి వస్తున్న స్పందనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఎమోషనల్ అయ్యారు. ‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న స్పందనతో కన్నీరు ఆగడం లేదు. పరిణీతి ఈజ్ బ్యాక్ అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది అస్సలు ఊహించలేదు. నేను తిరిగొచ్చేశా. ఎక్కడికీ వెళ్లను’ అని పేర్కొన్నారు. 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీలా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

News April 15, 2024

చిన్నారికి ధోనీ బహుమతి!

image

నిన్న ముంబై, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ధోనీ చెలరేగిన సంగతి తెలిసిందే. కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేశారు. అనంతరం పెవిలియన్‌కు తిరిగి వెళ్తూ అక్కడ ఉన్న తన అభిమానుల్లో ఓ చిన్నారికి మ్యాచ్‌లో వినియోగించిన బంతిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఐపీఎల్ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్ పెట్టిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. కాగా.. చివరికి ధోనీ చేసిన ఆ 20 పరుగుల తేడాతోనే చెన్నై గెలవడం విశేషం.

News April 15, 2024

కేజ్రీవాల్‌కు జుడీషియల్ కస్టడీ పొడిగింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు కోర్టు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. ఈ కేసులో మార్చి 21న అరెస్టైన ఆయన తిహార్ జైలులో ఉంటున్నారు.

News April 15, 2024

రాళ్ల దాడులు.. పొలిటికల్ హెల్మెట్లు వైరల్

image

AP: రాష్ట్రంలో నేతలపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. మొన్న సీఎం జగన్‌పై దాడితో ఎడమ కనుబొమ్మపై గాయం అయింది. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లోనూ రాళ్లు కలకలం రేపాయి. ఈ వరుస ఘటనలపై సోషల్ మీడియాలో పొలిటికల్ హెల్మెట్లు వైరల్ అవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు తమ పార్టీ రంగు, గుర్తుల హెల్మెట్లు ధరించాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తద్వారా ప్రాణాప్రాయం ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.

News April 15, 2024

రాళ్లు వేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉండొచ్చు: బొత్స

image

AP: సీఎం జగన్‌పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారని, చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డ్రామాలు చేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని, రాళ్లు వేయించుకునే అలవాటు ఆయనకే ఉండొచ్చని చెప్పారు. జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.