India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆయన అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఐక్యత లేకపోవడం వల్లే దేశంలోని విపక్షాలు బలహీనపడి, తమ శక్తిని కోల్పోయాయని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ తెలిపారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని చెప్పారు. ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై అమర్త్యసేన్ విమర్శలు చేశారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
TG: మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. 18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని పేర్కొంది. మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది.
ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేయర్ డారిల్ మిచెల్ ప్రదర్శన CSKకి ఆందోళన కలిగిస్తోంది. రూ.14 కోట్లు పెట్టి కొన్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారని ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో మిచెల్ కేవలం 135 పరుగులు మాత్రమే చేశారు. రాబోయే మ్యాచుల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పపువా న్యూగినియాలో భూకంపం అలజడి సృష్టించింది. తెల్లవారుజామున భూమి కంపించినట్లు యూఎస్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. రిక్టార్ స్కేల్‌పై 6.5 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా గత నెలలో సంభవించిన భూకంపం ధాటికి ఐదుగురు మరణించారు.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, BRS చీఫ్ కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో బహిరంగ సభకు హాజరుకానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు BRS ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి BRS అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
AP: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును బోర్డు ఖరారు చేసింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు ₹550, ప్రాక్టికల్స్‌కు ₹250, బ్రిడ్జి కోర్సు పరీక్షలు రాసేందుకు ₹150 చెల్లించాలంది. అలాగే మార్కుల మెరుగుదలకు రాసే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు ₹550 ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు ₹160 చెల్లించాలంది. రీవెరిఫికేషన్‌కు ₹1300, రీకౌంటింగ్‌కు ₹260 చొప్పున ఈ నెల 18 నుంచి 24 వరకు చెల్లించాలని తెలిపింది.
‘కాఫీ బ్యాడ్జింగ్’ తరహాలో ఇప్పుడు టెక్ వర్గాల్లో ‘షిఫ్ట్ షాక్’ అనే మరో పదం ట్రెండ్ అవుతోంది. ఓ వ్యక్తి కొత్త ఉద్యోగంలో చేరాక అక్కడ ఇమడలేక పోతున్నానని తెలుసుకున్న క్షణాన్ని షిఫ్ట్ షాక్ అంటారట. నియామకాల టైమ్‌లో సంస్థలు ఉద్యోగంపై సరైన వివరాలు ఇవ్వకపోవడం, ఉద్యోగి సంస్థతో సరిగ్గా సంప్రదింపులు చేయకపోవడం మొదలైన కారణాలతో ఈ ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు. దీంతో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారట.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో హరీశ్ రావు, RS ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు.
CSKతో మ్యాచులో రోహిత్ సెంచరీ కోసమే ఆడాడు కానీ.. జట్టు విజయం కోసం ప్రయత్నించలేదంటూ ట్విటర్‌లో ట్రోలింగ్ మొదలైంది. అతడు ‘సెల్ఫిష్’ అంటూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఒక్కడే నిలబడినా మిగతా ప్లేయర్ల నుంచి సహకారం అందలేదని అతడి ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. చివర్లో రోహిత్‌కు స్ట్రైకింగ్ కూడా సరిగా రాలేదని, అందుకు అతడేం చేస్తాడంటూ మండిపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.