India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం మోదీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ గ్యారంటీలన్నీ తప్పుడు హామీలేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి గత హామీలన్నీ అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ ఇప్పుడు 2047కు వాయిదా వేస్తున్నారు. గత పదేళ్లలో దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదు. ప్రజలు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’ అని విమర్శించారు.
AP: YSR జిల్లాలోని ప్రొద్దుటూరుకు అరుదైన రికార్డు ఉంది. 1957 నుంచి 1978 వరకు వరుసగా 5 ఎన్నికల్లో ఇండిపెండెంట్లే హవా సాగించారు. 6సార్లు INC, 3సార్లు TDP, 2సార్లు YCP అభ్యర్థులు గెలిచారు. ఈసారి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(YCP) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, టీడీపీ నుంచి రాజకీయ కురువృద్ధుడు నంద్యాల వరదరాజులు రెడ్డి బరిలో దిగుతున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు.<<-se>>#ELECTIONS2024<<>>
తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఇండియన్-2 నుంచి కమల్ హాసన్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సంఘ విద్రోహ శక్తులను ఏ మాత్రం క్షమించని సేనాపతి వచ్చే జూన్‌లో మళ్లీ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా రెడ్ అలర్ట్‌గా పరిగణించండి’ అని రాసుకొచ్చారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్, ప్రియ భవానీ శంకర్, SJ సూర్య, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయన్న ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. ఈక్రమంలో ట్విటర్‌లో ‘వరల్డ్ వార్ 3’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 51.7 వేల పోస్టులు ఈ ట్యాగ్‌తో వచ్చాయి. కొంతమంది భయం వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే మీరు ఎవరికి మద్దతిస్తారు అంటూ చర్చించుకుంటున్నారు.
KKRతో మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. పూరన్ 45, కేఎల్ రాహుల్ 39, ఆయుష్ బదోని 29 మినహా అందరూ విఫలమయ్యారు. KKR బౌలర్లలో స్టార్క్ 3, వైభవ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.
సినీ హీరో విశాల్ సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవని.. వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. ఇప్పటికే సీనియర్ హీరోలు కమల్ హాసన్, విజయ్ పార్టీలు స్థాపించిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా లేకపోవడం వల్లే బీజేపీని ఎదుర్కోలేకపోతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. వ్యవస్థాగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్.. తన ఘనమైన గతం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిరక్షరాస్యత, లింగ అసమానత్వం భారత అభివృద్ధికి అడ్డంకులుగా మారాయని విమర్శించారు. రాజ్యాంగంలో మార్పుల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు.
కన్నడ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్త సౌందర్య జగదీశ్(55) కన్నుమూశారు. ఆర్థిక కష్టాలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గుండెపోటు వల్లే మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు అండ్ పప్పు, మస్త్ మజా మాది(కిచ్చా సుదీప్), రామ్‌లీలా(చిరంజీవి సర్జా), స్నేహితరు(దర్శన్) తదితర చిత్రాలను ఈయన నిర్మించారు. కాగా నెల కిందటే జగదీశ్ కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది.
బాలయ్య-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా NBK109. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సినీవర్గాల్లో టాక్. ప్రస్తుతం బాలయ్య ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె సన్నివేశాలను తెరకెక్కించే అవకాశమున్నట్లు సమాచారం. 1980ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
IPLలో అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యాపై మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్‌కు పాండ్యా ఎంపిక కావడం కష్టమని అభిప్రాయపడ్డారు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించారు. అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తేనే దూబే వరల్డ్ కప్‌కి ఎంపిక కాగలరని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.