India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కనీసం రెండు మ్యాచ్‌ల్లోనైనా విశ్రాంతి ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ‘సిరాజ్ గతేడాది అద్భుత ప్రదర్శన చేశారు. అతడో ఛాంపియన్ బౌలర్. కానీ ఐపీఎల్‌లో ఎందుకో తేలిపోతున్నారు. అతడు అలసిపోయినట్లు కనిపిస్తోంది. సిరాజ్ శారీరకంగా, మానసికంగా దృఢంగా లేరనిపిస్తోంది. అతడికి కొంచెం సమయమిస్తే మంచి కమ్‌బ్యాక్ ఇస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.
TG: తమకు డ్రగ్స్ కావాలంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు ఖైదీలు ఆందోళన చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విచారణ ఖైదీలు అక్కడి సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో జైలు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక బ్యారక్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై జైలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
AP: బాల్య వివాహాన్ని ఎదురించిన అమ్మాయి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. కర్నూలు(D) ఆదోనికి చెందిన నిర్మల టెన్త్‌లో 537 మార్కులు సాధించింది. పేరెంట్స్ ఆమెకు బాల్య వివాహం చేయాలని నిర్ణయించారు. పెళ్లి ఇష్టంలేదని చెప్పిన నిర్మల IPS కావడమే ధ్యేయమని తెగేసి చెప్పింది. స్థానిక MLAను ఆశ్రయించగా ఆయన KGBVలో చేర్చించారు. నిన్న విడుదలైన ఫలితాల్లో నిర్మల 421/440 మార్కులు సాధించి జీవిత లక్ష్యం వైపు సాగుతోంది.
హీరో నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి-2’ చిత్రం విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రతినిధి’ సినిమా 10 సంవత్సరాల క్రితం ఇదే తేదీన విడుదల కావడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాలో నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
TG: మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయన కవితతో భేటీ కానున్నట్లు సమాచారం.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ ఒక్క ఎంపీ స్థానానికి కూడా ఆ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తుందా.. లేదా కొన్ని సీట్లలో పోటీ చేస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో JSP 8 చోట్ల పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది.
కర్ణాటక సీఎం సిద్ద రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. MLAలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. అయితే ఈ ప్రక్రియలో బీజేపీ విఫలమైందని తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.
వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(2026) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై తాను పోటీ చేస్తానని బీజేపీ నేత, హీరోయిన్ నమిత ప్రకటించారు. ‘రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని అనుకుంటున్నా. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
అయోధ్య రాముడి థీమ్‌తో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాణేల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని రామ్ లల్లా, రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన 3 సావనీర్ నాణేలను గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎస్పీఎంసీఐఎల్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.
ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన ఆసియా వ్యక్తిగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు. దీంతో ఆస్ట్రేలియాలో మోస్ట్ పాపులర్, సెర్చ్‌డ్ పర్సన్‌గా కోహ్లీ ఆరోసారి నిలిచారు. 2017,18,19,2022,23&24లో విరాట్ కోసం ఆస్ట్రేలియన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. కాగా ప్రస్తుత ఐపీఎల్‌లో ఈ రన్ మెషీన్ చెలరేగి ఆడుతున్నారు. 6 మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేశారు.
Sorry, no posts matched your criteria.