India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అన్ని ప్రభుత్వ స్కూళ్లలో క్రమం తప్పకుండా వాటర్ బెల్ కార్యక్రమం కొనసాగించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ‘విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నివారణకు రోజుకు 3సార్లు వాటర్ బెల్ నిర్వహించాలి. ఏప్రిల్ 23 వరకు ప్రతిరోజూ DEOలు దీన్ని పర్యవేక్షించాలి. మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు గుర్తించేలా అవగాహన కల్పించాలి. ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు వాటర్ బెల్ మోగించాలి’ అని పేర్కొంది.
భారత్‌పై నోరు జారి పదవి పోగొట్టుకున్న మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చేసిన పోస్ట్‌లో ఆ పార్టీ లోగోకు బదులు భారత జాతీయ జెండాపై ఉండే అశోక చక్రం ఉంది. దీనిపై విమర్శలు రావడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ పోస్ట్ చేయలేదని మరియం క్షమాపణలు కోరారు. గతంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు.
ఇజ్రాయెల్‌తో శాంతిచర్చల్లో ఎలాంటి పురోగతీ లేదని హమాస్ సంస్థ ప్రకటించింది. ఈజిప్టులో ఇజ్రాయెల్‌తో కొత్తగా మరో దఫా చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదని స్పష్టం చేసింది. యుద్ధం చివరి దశకు చేరిందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులందరినీ విడిచిపెడితే తప్ప యుద్ధాన్ని ఆపేదిలేదని ఆయన తేల్చిచెబుతుండటం గమనార్హం.
సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో మణిపుర్‌లో పరిస్థితి కుదుటపడిందన్నారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు అత్యుత్తమ వనరులు, నిర్వహణ సిబ్బందిని కేంద్రం రంగంలోకి దింపిందని తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపుర్ చేరుకుని 15కుపైగా సమావేశాలు నిర్వహించి పరిస్థితి పర్యవేక్షించారని పేర్కొన్నారు.
AP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామినీ బాల తల్లి శమంతకమణి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె కొడుకు అశోక్ కూడా పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించిన వీరికి భంగపాటు ఎదురైంది. దీంతో పార్టీని వీడారు. నిన్న యామినీ బాల వైసీపీని వీడిన సంగతి తెలిసిందే.
TG: సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ దగ్గర ఒక్కసారిగా ల్యాండ్ క్రూజర్ టైర్ పేలింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా సీఎం మొయినాబాద్ మీదుగా కొడంగల్ వెళ్లారు.
AP: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకే సలహాలు తీసుకుని ఉంటే మునిగేవాళ్లమని అన్నారు. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ నేతల దగ్గర పీకే డబ్బులు తీసుకునేవాడని ఆరోపించారు. మేనేజ్ మెంట్ తప్ప ప్రశాంత్ కిశోర్ చేసేదేమీ లేదని దుయ్యబట్టారు. బిహార్ నుంచి PKను తరిమికొట్టారని అందుకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు.
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, గెస్ట్ హౌస్ <<13012357>>ప్రస్తావన<<>> రావడంపై BRS ఎమ్మెల్సీ నవీన్‌రావు స్పందించారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారంలో కొందరు కావాలనే నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్ట్ హౌస్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై చట్టపర చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.
మాజీ మంత్రి కేటీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన అమ్మమ్మతాతలు జె.లక్ష్మి, జె.కేశవరావుల జ్ఞాపకార్థం కొత్త పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని చేసిన ప్రమాణాన్ని నెరవేర్చినట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాక గ్రామంలో నిర్మిస్తున్న ఈ స్కూల్ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
TS: జూన్ 8 లేదా 9న ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేస్తారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. మోదీ వచ్చాక దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ దిగుమతి చేసుకునేవాళ్లమని.. మోదీ వచ్చాక విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. రాహుల్ గాంధీ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.