India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చెప్పారు. బైక్ మెకానిక్‌లు, కార్మికులతో మాట్లాడుతూ.. ‘జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులే. పనుల్లేక వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మేం అధికారంలోకి రాగానే మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. బైక్ మెకానిక్‌లకు అధునాతన వాహనాలపై శిక్షణ ఇప్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.
TG: కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే అనర్హులు అయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెప్పారు. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించారు. తాజాగా మరో ఎమ్మెల్యేకి కాంగ్రెస్ కండువా కప్పారు. ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రూ.49వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే పోలీసులు సీజ్ చేస్తారు. అలాగే ఒక తులం బంగారం వరకు తీసుకెళ్లొచ్చు. వీటికి మించితే సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉండాలి. లేదంటే డబ్బు/బంగారం స్వాధీనం చేసుకుని, ఎన్నికలు ముగిశాక తిరిగి అందిస్తారు. ఒకవేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలితే సంబంధిత వ్యక్తిపై FIR నమోదు చేస్తారు.
IPL: RRతో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ దిగాలుగా కూర్చొని ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. జట్టు కోసం సెంచరీ చేసినా కోహ్లీ శ్రమ వృథా అయింది. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడం, బౌలర్లు తేలిపోవడంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది. కోహ్లీని ఇలా చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తన కుటుంబసభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరగాలని, మళ్లీ జరగకుండా చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
AP: తన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ‘అవినాశ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటానికి సిగ్గు లేదా? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చింది’ అని మండిపడ్డారు. తెలంగాణలో KCRను ఓడించానని, ఏపీలో పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చానని షర్మిల వ్యాఖ్యానించారు.
రోహిత్ శర్మ మైదానంలో అలవోకగా సిక్సర్లు బాది విధ్వంసం సృష్టిస్తారు. దీని వెనుక అతడి ఫిట్‌నెస్ పాత్ర ఎంతో ఉంది. రోహిత్ కచ్చితంగా డైట్ పాలో అవుతారు. ఉదయాన్నే గుడ్లు, ఓట్స్, పండ్లు తీసుకుంటారు. మధ్యాహ్నం బ్రౌన్ రైస్, చికెన్, వెజిటబుల్స్ తింటారు. రాత్రి పూట గ్రిల్డ్ ఫిష్, సలాడ్, బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకుంటారు. కాగా రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినా.. ఫిట్‌గా ఉండేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పట్లేదు.
TG: కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. డబ్బులు పెట్టి నాయకులను కొనడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఒకవేళ రాష్ట్రంలో 10కి పైగా సీట్లు గెలుచుకున్నా.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
AP: వివేకా హత్య కేసులో సాక్ష్యాలు చెరిపేస్తుంటే చూస్తూ ఉండడానికి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఏమైనా అమాయకుడా అని వైఎస్ సునీత ప్రశ్నించారు. ‘అవినాశ్ ఏమైనా పాలు తాగే పిల్లాడా? ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడం సమంజసమేనా? అవినాశ్‌ను పక్కన పెట్టుకుని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివేకా హత్య గురించి మాట్లాడటం దుర్మార్గం. రాజకీయంగా అడ్డొస్తున్నారనే వివేకాను హత్య చేశారు’ అని ఆమె మండిపడ్డారు.
TG: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుదారులను పక్కనే పెట్టుకుని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి నిర్మించిన వాటిని వంద రోజుల్లోనే నాశనం చేశారని అన్నారు. కొత్తగా మారుస్తారనుకుంటే.. 2014కు ముందు ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావుల పరిస్థితులే వస్తాయన్నారు.
Sorry, no posts matched your criteria.