News November 7, 2025

ప్రతీకా రావల్‌కు ప్రపంచకప్ మెడల్!

image

గాయం కారణంగా మహిళల ప్రపంచకప్ చివరి 2 మ్యాచ్‌లకు ప్రతీకా రావల్ <<18122584>>దూరమైన<<>> విషయం తెలిసిందే. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి షెఫాలీ వర్మ రావడంతో ప్రతీకకు మెడల్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ICC ఛైర్మన్ జైషా చొరవ తీసుకున్నారు. ‘మెడల్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు జైషా నా మేనేజర్‌కు మెసేజ్ చేశారు. తర్వాత మెడల్ వచ్చేసింది. తొలిసారి దాన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ప్రతీక చెప్పారు.

News November 7, 2025

పోలీస్ ట్రైనింగ్‌లో ‘భగవద్గీత’.. విమర్శలు

image

ట్రైనీలు భగవద్గీత చదవాలని MP పోలీస్ ట్రైనింగ్ వింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది. 8 పోలీస్ ట్రైనింగ్ స్కూళ్లలో రాత్రి మెడిటేషన్ సెషన్‌కు ముందు భగవద్గీతలోని ఒక చాప్టర్ చదవాలని ADGP రాజా బాబూ సింగ్ ఆదేశాలిచ్చారు. ట్రైనీలు ధర్మబద్ధంగా నడుచుకునేలా గీత గైడ్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇది కాషాయీకరణ ప్రయత్నమని, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ మండిపడింది. పోలీసింగ్‌ను మెరుగుపరిచే వ్యాయామమని BJP సమర్థించింది.

News November 7, 2025

PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

image

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.

News November 7, 2025

ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

image

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.

News November 7, 2025

సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌లో 49 ఉద్యోగాలు

image

<>మినిస్ట్రీ<<>> ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌ 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60శాతం మార్కులతో పాసైనవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in

News November 7, 2025

జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

image

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.

News November 7, 2025

ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

image

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్‌) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.

News November 7, 2025

తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

image

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.

News November 7, 2025

చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

image

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.

News November 7, 2025

కుప్పకూలిన ATC వ్యవస్థ.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం

image

ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో సుమారు 500, ముంబైలో 200 ఫ్లైట్స్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ అటాక్‌లో భాగమైన <<18227204>>జీపీఎస్ స్పూఫింగే<<>> దీనికి కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.