News October 29, 2024

షర్మిలకు అన్యాయం జరిగింది: విజయమ్మ

image

AP: జగన్ CM అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడని తల్లి విజయమ్మ అన్నారు. ‘ఇప్పుడు ప్రచారంలో ఉన్న MOU జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200Cr డివిడెండ్లు ఇచ్చారు. MOUలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, అందులో లేని యలహంక ప్రాపర్టీ 100% షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వలేదు. పైగా అటాచ్‌మెంట్లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం జరిగింది’ అని ఆవేదన చెందారు.

News October 29, 2024

జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా: సీఎం ఒమర్

image

జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్రహోదా వస్తుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో ఈ విషయంలో హామీ లభించిందన్నారు. ‘యూటీ హోదా తాత్కాలికమే. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా వస్తుంది. అత్యున్నత స్థాయిలో నాకు హామీ లభించింది’ అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేంద్రం ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం.

News October 29, 2024

వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. నవంబర్ రెండో వారంలో వారంపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం.

News October 29, 2024

ఆస్తుల పంపకం అవాస్తవం: విజయమ్మ

image

AP: వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం చేశారన్నది అవాస్తవమని వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ‘విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉండటంతో ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా సాక్షి సంతకం పెట్టారు. కానీ ఇద్దరూ స్పృహ లేకుండా అవాస్తవాలు మాట్లాడారు. జగన్, షర్మిల పెరుగుతున్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదు’ అని స్పష్టం చేశారు.

News October 29, 2024

గోల్ఫ్ కోర్స్‌ ఏర్పాటుపై సీఎంతో చర్చించా: కపిల్ దేవ్

image

AP: క్రీడలపై CM CBN చాలా ఆసక్తి ఉన్నారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్‌ ఏర్పాటుపై CMతో చర్చించినట్లు చెప్పారు. అందుకు స్థలం ఎక్కడ ఇస్తారనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. AP అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరినట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతి, విశాఖ, అనంతపురంలో కోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

News October 29, 2024

YS అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ

image

AP: తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని విజయమ్మ అన్నారు. ‘జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధేస్తోంది. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరూ కల్పిత కథలు రాయొద్దు. వాళ్లిద్దరే(జగన్, షర్మిల) సమాధానం పొందుతారు. దేవుడు అన్నింటికీ పరిష్కారం చూపుతాడు’ అని తెలిపారు.

News October 29, 2024

అంతరించిపోయే దశలో ఆఫ్రికన్ పెంగ్విన్స్

image

నలుపు, తెలుపు రంగులలో విలక్షణంగా కనిపించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు IUCN తెలిపింది. ప్రపంచంలోని 18 పెంగ్విన్ జాతులలో అంతరించిపోయే దశకు చేరుకున్న మొదటి జాతి ఇదేనని పేర్కొంది. ఆహారం దొరకకపోవడం, వాతావరణ మార్పులు, సంతానోత్పత్తి కాలనీల సమీపంలో చేపల వేట కొనసాగించడం వీటి మనుగడకు పెను ముప్పుగా మారాయంది. వీటి సంరక్షణకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని IUCN కోరింది.

News October 29, 2024

ఎవరి పర్మిషన్ తీసుకోవాలో చెప్పండి సార్: మంత్రికి మందుబాబు లేఖ

image

TG: మద్యం తాగడానికి ఎవరి అనుమతి తీసుకోవాలో చెప్పాలని ఓ మందుబాబు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ‘మద్యం తాగాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని మీరు చెప్పారు. దీంతో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలంటే భయం వేస్తోంది. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి. CM దగ్గరా? మీ వద్దనా? ఎక్సైజ్ శాఖ వద్దనా? ఒక క్లారిటీ ఇస్తే నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటా’ అని సదరు మద్యం ప్రియుడు లేఖలో పేర్కొన్నారు.

News October 29, 2024

హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు

image

అయోధ్యలోని కోతులకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. వానరాలకు ఆహారం అందించేందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని ఆయన సమకూర్చారు. దాదాపు 1,200 కోతులకు ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు. నగరం బయట కొన్ని ప్రదేశాల్లో వాటికి ఫుడ్ అందిస్తారు. తన తల్లిదండ్రులు, మామ రాజేశ్ ఖన్నా పేరు మీదుగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

News October 29, 2024

రాష్ట్రంలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్

image

TG: సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన జరిగింది. హుస్నాబాద్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా నిన్న ఆ చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులు బాధితురాలి కాలనీకి చెందినవారేనని గుర్తించారు. మరోవైపు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.