News March 23, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై 26న విచారణ

image

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు కవిత కస్టడీని 3 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.

News March 23, 2024

YCP.. యువజన కొకైన్ పార్టీ: TDP

image

AP: విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారంపై YCP, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. సీఎం జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల భార్గవ్‌‌లను టార్గెట్ చేస్తూ TDP సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. YCP అంటే యువజన కొకైన్ పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా ఈ కేసులో నిందితులు, TDP సీనియర్ నేతలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ YCP కౌంటర్ ఇచ్చింది. డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయి TDP బుకాయిస్తోందని దుయ్యబట్టింది.

News March 23, 2024

వడోదర బీజేపీ ఎంపీ కీలక నిర్ణయం

image

వడోదర బీజేపీ ఎంపీ రంజనాబెన్ భట్ వచ్చే లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదర స్థానం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు ఇక్కడి నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వడోదర స్థానానికి మోదీ రాజీనామా చేయగా ఉప ఎన్నికలో రంజనా గెలుపొందారు.

News March 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? – 1/3

image

ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ సంచలనమైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్‌తో కేజ్రీవాల్‌కే లబ్ధి అని కొందరు, బీజేపీకే లాభం అనేది మరికొందరు అనుకుంటున్నారు. అయితే ఏ పక్షానికీ పూర్తిగా లబ్ధి ఉండదనేది విశ్లేషకులు మాట. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌తో సింపతీ వస్తుందనే గ్యారంటీ లేదంటున్నారు. అందుకు గతంతో జరిగిన అరెస్ట్‌లే ఉదాహరణగా చెబుతున్నారు.

News March 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? – 2/3

image

తమిళనాడులో దివంగత నేతలు DMK మాజీ చీఫ్ కరుణానిధి, AIADMK మాజీ చీఫ్ జయలలిత ఇద్దరూ జైలుకు వెళ్లిన వారే. ఒకరు జైలుకు వెళ్లినప్పుడు మరొకరు అధికారం చేపట్టారు. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే ప్రత్యర్థికి అవకాశం వచ్చిందని, ఆ నాయకుల మీద సానుభూతితో కాదనేది విశ్లేషకుల మాట. చిదంబరం, లాలూ, డీకే శివకుమార్, యడియూరప్ప.. డీఎంకే నేతలు రాజా, కనిమొళి మొదలైన వారు జైలుకు వెళ్లొచ్చినా సింపతీ వర్కౌట్ కాలేదు.

News March 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? – 3/3

image

ఇక తెలుగు రాష్ట్రాల్లో BRS MLC కవిత అరెస్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వలాభానికి వాడుకుంటోందని బీజేపీపై ఆరోపణలు ఉన్నా వాటి ప్రభావం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల మాట. అరెస్ట్‌లు సరైన కారణాలతోనే జరుగుతున్నా ఏజెన్సీల వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనికి ఏజెన్సీలు చెక్ పెట్టకుంటే అది వాటి విశ్వసనీయతపై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.

News March 23, 2024

కవిత మొబైల్‌లో కొంత డేటా డిలీట్ అయ్యింది: ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై కోర్టులో విచారణ సందర్భంగా ED కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సోదాల సందర్భంగా కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. మొబైల్‌లోని కొంత డేటా డిలీట్ చేసినట్లు గుర్తించాం. ఆమె ఫోన్‌లోని డేటాను విశ్లేషించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌తో సరిపోల్చి చూశాం. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పాలని కోరగా, ఆమె తెలియదని చెప్పారు. అతడు ఇప్పుడు కనిపించట్లేదు’ అని పేర్కొంది.

News March 23, 2024

BREAKING: కవిత కస్టడీ పొడిగింపు

image

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. మళ్లీ 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ఈ 3 రోజులు అరవింద్ కేజ్రీవాల్‌తో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.

News March 23, 2024

ఘోరం: కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం

image

పంజాబ్‌లో సంగ్రూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిపాలవగా, వారిలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

News March 23, 2024

20.50cr+24.75cr = 45.25cr

image

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్ స్టార్క్ ఇవాళ తొలి మ్యాచ్ ఆడనున్నారు. కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు దక్కించుకున్న SRH కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రూ.24.75 కోట్ల రికార్డు ధరతో KKR సొంతం చేసుకున్న పేసర్ స్టార్క్ కీలక బౌలర్‌గా బరిలోకి దిగనున్నారు. అతడు ఒక్క బంతి వేస్తే సుమారు రూ.7.36 లక్షలు సంపాదిస్తారు. మరి ఈ కోట్ల వీరుల ప్రదర్శన ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం.