News March 21, 2024

IPL: చెన్నైకి కొత్త కెప్టెన్

image

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు సీఎస్కే అనుహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను మార్చింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు పాల్గొన్న ఫొటో షూట్‌లో ధోనీ స్థానంలో గైక్వాడ్ వచ్చారు. చెన్నైకి రుతురాజ్ కెప్టెన్ అని IPL ట్విటర్ అకౌంట్‌లో అధికారికంగా ప్రకటించారు. పంజాబ్ జట్టుకు జితేశ్ శర్మ వైస్ కెప్టెన్ అని తెలిపారు.

News March 21, 2024

ఎలక్టోరల్ బాండ్లు: సీరియల్ నంబర్లు సమర్పించిన SBI

image

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించింది. సీరియల్ నంబర్లతో కూడిన డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది. దీని వల్ల ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంది.

News March 21, 2024

‘విశ్వంభర’తో త్రిష

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వ‌స్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత చిరంజీవితో క‌లిసి న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవి, ఎంఎం కీరవాణిల‌తో త్రిష ఫొటో దిగారు. దానిని ట్వీట్ చేసిన ఆమె ‘లెజెండ‌రీల‌తో దివ్య‌మైన ఉద‌యం’ అని క్యాప్షన్ ఇచ్చారు.

News March 21, 2024

5 ఎకరాల వరకు రైతుబంధు రేపు పూర్తి: మంత్రి పొంగులేటి

image

TG: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదు జమ రేపు పూర్తి చేస్తామని చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదలమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు.

News March 21, 2024

ప్రతి సోమవారం ఉపవాసం ఉంటా: సీజేఐ

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నేను నా భార్య పూర్తి శాకాహారులం. మా జీవనశైలి మొక్కల ఆధారితం. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుందని మేము నమ్ముతాం. అలాగే 25 ఏళ్లుగా ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటున్నా. రోజూ ఉదయం 3.30 గంటల సమయంలో యోగా చేస్తా. నాకు ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం’ అని సీజేఐ చెప్పారు.

News March 21, 2024

ఆస్పత్రిలో టాలీవుడ్ టెక్నీషియన్.. నరేశ్ ట్వీట్ వైరల్

image

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన టాలీవుడ్‌ ప్రముఖ డబ్బింగ్ ఇంజినీర్ ఈమని శ్రీనివాస్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నట్లు నటుడు నరేశ్ తెలిపారు. ‘శ్రీనివాస్ రెండేళ్లుగా రెగ్యులర్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈయన భార్య కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. త్వరలో సర్జరీ జరగనుంది. అయితే, సర్జరీకి అవసరమయ్యే డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. దయచేసి సాయం చేయండి’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2024

ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం: జూపల్లి

image

TG: నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందజేస్తామన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామని వెల్లడించారు. అన్నదాతలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్‌ అని మంత్రి పునరుద్ఘాటించారు.

News March 21, 2024

రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

image

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,090 పెరిగి రూ.67,420కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.1,000 పెరిగి రూ.61,800కి చేరింది. అటు కేజీ వెండి రూ.1,500 పెరిగి రూ.81,500 పలుకుతోంది. ఈ ఒక్క నెలలోనే గోల్డ్ రేట్లు 5% మేర పెరిగాయి. ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లలో కనీసం 3 సార్లు తగ్గింపు ఉంటుందన్న అమెరికా ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ ప్రకటనతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.

News March 21, 2024

OTT నుంచి మాయమైన సూపర్‌హిట్ మూవీ

image

కన్నడ‌లో హిట్‌గా నిలిచిన ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమాను OTT నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించింది. సడెన్‌గా ఈ సినిమా మాయమైందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ5 నెట్‌వర్క్ సొంతం చేసుకోగా.. కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల తొలుత ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యిందట. త్వరలో జీ5 OTTలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News March 21, 2024

లంచగొండిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

image

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.