India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. నరేందర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు నిరంతరం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా ఉంచారని తెలిపారు. సీఎం జగన్, సజ్జల, పెద్దిరెడ్డిల ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఫైరయ్యారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని బొండా చెప్పారు.
AP: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మడకశిర సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ రైతు తన 6.36 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. డబ్బు తీసుకునే సమయంలో దామోదర్‌తో పాటు దస్తావేజు లేఖరిని ఏసీబీ పట్టుకుంది.
గతంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ఏడాది వ్యవధిలో రిలయన్స్ పవర్ షేర్లు 120% పెరగడం ఆయనకు కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఐసీఐసీఐ, యాక్సిస్, DBS బ్యాంకులకు ఆయన చెల్లించాల్సిన బాకీలు సెటిల్ చేసేశారట. ఇప్పుడు జేసీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి కట్టాల్సిన రూ.2100 కోట్ల రుణాన్ని కూడా తీర్చేందుకు సిద్ధమయ్యారట.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించి జెర్సీని ఆ టీమ్ రివీల్ చేసింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్ గ్రీన్ జెర్సీలో హాజరయ్యారు.
తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్‌ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను ₹75, ₹65, ₹500గా ఖరారు చేస్తామని పేర్కొంది. స్టూడెంట్స్‌కు ఫ్రీ సిమ్ కార్డు, నెలకు 1GB డేటా, స్వయం సహాయక మహిళా గ్రూపులకు ₹10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. ‘చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రలా నిలబడ్డాయి. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారు. బాబుది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అనే నైజం. ఈ మూడు పార్టీల పొత్తు ముందే ఊహించాం’ అని దుయ్యబట్టారు.
AP: చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాఫియాలతో పొత్తులేకుండా పెద్దిరెడ్డి ఎన్నికల్లో నిలబడాలన్నారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. టీడీపీ పొత్తులు బహిరంగమేనని.. జగన్‌వి చీకటి పొత్తులని విమర్శించారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.
TG: వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, డీఎంఈ, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అలీసియా హల్లోక్ బోటాక్స్ ఇంజెక్షన్లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందేందుకు ఆమె ఈ ఇంజెక్షన్లు తీసుకోగా అవి వికటించి పక్షవాతం బారిన పడేలా చేశాయి. అంతేకాదు కంటిచూపు మందగించడం, మాట్లాడలేకపోవడం, ఆహారాన్ని తీసుకోలేకపోవడం మొదలైన సమస్యలు కూడా వచ్చాయట. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె తాను ఇక బతకనేమోనని అనుకున్నానని వాపోయారు.
Sorry, no posts matched your criteria.