News March 17, 2024

ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: పృథ్వీరాజ్ సుకుమారన్

image

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో తాను నజీబ్ అనే బానిస పాత్ర పోషించానని, ఇందు కోసం 31 KGల బరువు తగ్గానని పృథ్వీ వెల్లడించారు. జిమ్ ట్రైనర్, డాక్టర్ల పర్యవేక్షణతో ఇది సాధ్యమైందన్నారు. జోర్డాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్‌డౌన్ విధించడంతో చాలా కష్టపడ్డామని తెలిపారు. కాగా ఈ చిత్రం ‘ది గోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లిష్‌లోనూ రిలీజ్ కానుంది.

News March 17, 2024

మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్: మంత్రి అంబటి

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన ప్రజాగళం సభలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడంపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ‘మైక్ ఫెయిల్.. మీటింగ్ ఫెయిల్.. టోటల్‌గా ముగ్గురూ ఫెయిల్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తోన్న సమయంలో నాలుగైదుసార్లు మైక్ కట్టయ్యింది. లైవ్ కూడా అస్తవ్యస్తంగా ప్రసారమైన విషయం తెలిసిందే.

News March 17, 2024

థ్రిల్లింగ్: భూమి నుంచి 30KM ఎత్తులో భోజనం..

image

ఆకాశంలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తూ భోజనం చేయడమనే ఆలోచనే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. USకు చెందిన SpaceVIP అనే ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ దీన్ని వచ్చే ఏడాది నిజం చేయనుంది. ప్రపంచంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ స్పేస్ కాప్సుల్ ద్వారా లక్ష అడుగుల(30KM) ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడ భోజనం చేస్తూ సన్ రైజ్‌ను చూడొచ్చు. భూమిపై ఉన్నవారితో లైవ్ వీడియో మాట్లాడొచ్చు. ఒక్కొక్కరికి ధర రూ.4 కోట్లు.

News March 17, 2024

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

image

AP: జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉ.10 గంటలకు TTD విడుదల చేయనుంది. 20వ తేదీ ఉ.10 వరకు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 21న ఉ.10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లు విడుదలవుతాయి. 23న ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.
వెబ్‌సైట్: <>https://ttdevasthanams.ap.gov.in<<>>

News March 17, 2024

నంబర్ 1 స్థానంలో ‘ప్రజాగళం’ ట్రెండింగ్!

image

AP: చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రజాగళం హ్యాష్ ట్యాగ్ అగ్రస్థానంలో ట్రెండ్ అయింది. 67వేలకు పైగా పోస్టులు ట్విటర్‌లో వచ్చాయి. ఏపీ వెల్కమ్స్ మోదీ, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్‌ అయ్యాయి.

News March 17, 2024

కేసీఆర్‌కు ఝలకిచ్చే ప్లాన్!

image

కాంగ్రెస్‌లో BRSLP విలీనం దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే BRS పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా బీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టడమే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.

News March 17, 2024

ఆర్సీబీ టార్గెట్ 114

image

మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. 18.2 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు షెఫాలీ 44, లానింగ్ 23 పరుగులతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ 3 వికెట్లతో సత్తా చాటారు.

News March 17, 2024

దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేయనున్న BRS

image

TS: కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. దానంపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసేందుకు సభాపతి ఇంటికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చి ఇప్పుడు స్పీకర్ స్పందించడం లేదని.. రేపు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు.

News March 17, 2024

పుష్ప-2 మూవీపై క్రేజీ రూమర్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప-2పై మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కొన్ని సీన్లలో బన్నీ ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తాడని, తన వాయిస్ మాడ్యులేషన్‌ను కూడా ఓల్డ్ ఏజ్ స్టైల్‌లో చెప్పబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌పై యూనిట్ స్పందించాల్సి ఉంది. అటు రెట్టించిన ఉత్సాహంతో ఆడియన్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

News March 17, 2024

రూ. 41వేల కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ విలువ!

image

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ విలువ గత రెండేళ్లలో రూ. 41వేల మేర తగ్గింది. దాని మాతృసంస్థ వాల్‌మార్ట్ ఈక్విటీ వివరాల్లో ఈ విషయం వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది జనవరికి అది 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ అంచనాలను ఫ్లిప్‌కార్ట్ తప్పుబట్టింది. తమ సంస్థ నుంచి ఫోన్‌ పే 2023లో వేరుపడినప్పటికీ.. ఆ సమాచారాన్ని వాల్‌మార్ట్ అప్‌డేట్ చేయలేదని వివరించింది.