India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు
✒ పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు
✒ యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు
✒ తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు
✒ దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు
✒ 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు
✒ 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు
✒ సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు
✒ ట్రాన్స్‌జెండర్లు 48,000
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలుకానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్నారు. ముంబైలో జరిగిన వేడుకలో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది. తన ఆదాయంలో సగానికి పైగా విరాళం ఇచ్చిన ఆయన.. ట్రస్టు ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
కెప్టెన్ కూల్ MS ధోనీ, కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్‌లో ధోనీ, కోహ్లీ మైదానంలో నడిస్తే చాలు ఫ్యాన్స్ అంతా టైలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో పదేళ్ల పిల్లల్లా మారిపోతారు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ నమ్మశక్యం కానిది. వారు కేవలం మైదానంలోకి వస్తే చాలు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేస్తారు’ అని చెప్పుకొచ్చారు.
దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జూన్ 16లోపు ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు.
AP: శ్రీకాకుళం(D) ఆమదాలవలసలో మరోసారి మామాఅల్లుళ్ల పోటీ జరగనుంది. కూన రవికుమార్(TDP)కి స్పీకర్ తమ్మినేని సీతారాం(YCP) స్వయాన మేనమామ. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధంతో స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికే 3సార్లు వీరు ఎన్నికల్లో తలపడగా మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014లో TDP తరఫున రవి, 2019లో సీతారాం YCP నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
AP: టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాని నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు విశాఖ జిల్లాలోనే టికెట్ కేటాయించాలని గంటా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనను చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
వైసీపీ అభ్యర్థుల్లో రెండు కుటుంబాల తండ్రీకొడుకులకు టికెట్లు దక్కాయి. పుంగనూరు ఎమ్మెల్యేగా కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక ఇదే తరహాలో ఈయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా తిరిగి బరిలో నిలుస్తారని పార్టీ ప్రకటించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు MP స్థానం, ఆయన కొడుకు మోహిత్- చంద్రగిరి MLA టికెట్లు పొందారు.
రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది.
* మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 సీటు గెలిచాయి. 2014తో పోల్చితే వైసీపీకి 84సీట్లు పెరిగాయి. టీడీపీ 49 సీట్లు కోల్పోయింది.
కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.