India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్‌కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో.. 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలిచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈనెల 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 19న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు 10% వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024లో కేంద్రం మార్పులు చేయడం, ఫేమ్-2 స్కీమ్ గడువు ఈనెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ స్కీమ్ కింద బైక్‌లపై ₹5,000 నుంచి ₹10వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది
TG: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని సీపీఎం యోచిస్తోంది. మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎస్ఐ పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4,208 ఉన్నాయి. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై.. మే 14 వరకు కొనసాగనుంది. ఎస్ఐ పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలి. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
దేశంలో తొలి లోక్‌సభ ఎన్నికల్లో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేరు చెప్పలేదు. ఫలానా వ్యక్తి భార్యననో, ఫలానా వ్యక్తి కూతురుననో అని చెప్పారు. అప్పటి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆ మహిళలు అలా ప్రవర్తించారు. ఈ సమస్య ఎక్కువగా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎదురైంది. కాగా సరైన పేర్లు చెప్పని 28 లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు వరించింది. ఇస్రో తరఫున అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అసాధారణ విజయాలను సాధించినందుకు ‘ఏవియేషన్ వీక్’ అవార్డులు అందిస్తుంది.
ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది విడుదల కానున్న పలు సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, సూర్య ‘కంగువా’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, నితిన్ ‘తమ్ముడు’, అనుష్క ‘ఘాటి’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ మూవీలు థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకు OTTలోకి వస్తాయి.
సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెల్లవారుజామున స్టేషన్‌కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ అందుబాటులో ఉంటుందంటున్నారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైన్ పూర్తికాకపోవడంతో ఈ రైలు టైమింగ్స్ మార్చలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
TG: అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది. ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున EC అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా.
Sorry, no posts matched your criteria.