India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: చిలకలూరిపేటలో TDP-JSP-BJP మీటింగ్ విఫలమైందని, ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘గతంలో ఇచ్చిన హామీల పరిష్కారంపై మాట్లాడలేదు. కొత్త హామీల ఊసెత్తలేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ విజన్ గురించి ప్రస్తావించలేదు. వారికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని Xలో మండిపడ్డారు.
హోరా హోరీగా సాగిన WPL ఫైనల్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అయితే లీగ్ విన్నర్, రన్నరప్ అందుకునే ప్రైజ్ మనీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. RCB జట్టు ట్రోఫీతో పాటు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్ DCకి రూ.3 కోట్లు వచ్చాయి. ఇక ఆరెంజ్ క్యాప్ విన్నర్ పెర్రీ రూ. 5లక్షలు గెలుచుకున్నారు. కాగా, IPL-2023 విన్నర్ CSKకి రూ.20 కోట్లు వచ్చాయి.
AP: ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2023-24లో 1.81 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1.42 లక్షల టన్నులు), UP(1.27 లక్షల టన్నులు) ఉన్నాయని తెలిపింది. దేశంలో ఉత్పత్తి 11.20 లక్షల టన్నులు కాగా, AP వాటా 16.16 శాతమని పేర్కొంది. అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలోనూ రాష్ట్రం తొలి స్థానంలో నిలవడం విశేషం.
తన ప్రియుడు మైఖేల్‌ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనని హీరోయిన్ ఇలియానా అన్నారు. ‘నా గురించి ఎవరేం మాట్లాడినా తట్టుకున్నా. నెటిజన్లు నన్న ఘోరంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నా కాబట్టి భరించా. కానీ నా భాగస్వామి, కుటుంబంపై విమర్శలు వస్తే భరించలేను. నా కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ రాకతో మా జీవితం మారిపోయింది. గతేడాది ఎంతో సంతోషంగా గడిచింది’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కానుంది. పోలింగ్ కోసం 1.50 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను జల, వాయు, రోడ్డు మార్గాల ద్వారా ఈసీ తరలించనుంది. దాదాపు 4 లక్షల వాహనాలను ఉపయోగించనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికలకు అవసరమయ్యే 26 లక్షల ఇంక్ బాటిళ్లను కర్ణాటకలోని మైసూరు నుంచి దేశమంతా తరలించనున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిందిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందిలో ముగ్గురికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న కవితను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.
TG: పదో తరగతి పరీక్షలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘విద్యాశాఖ సూచన మేరకు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి. ‘విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చు. క్షేమంగా వెళ్లి ప్రశాంతంగా పరీక్ష రాయండి’ అని పేర్కొన్నారు.
AP: 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి కేంద్రం బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సమీక్షించిన సీఎస్ జవహర్‌రెడ్డి.. ‘ఇకపై పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం ఇదే. స్కూళ్లలో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, వివాహ నమోదు సహా పలు ప్రయోజనాలకు ఇది తప్పనిసరి. పుట్టిన 7 రోజుల్లోనే ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి’ అని ఆదేశించారు.
TG: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో కామారెడ్డిలో 20వేలు, నిజామాబాద్‌లో 6వేలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలతో పాటు గోధుమ, ఉల్లి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ వేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ మరో అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను ఏప్రిల్-2018లో ఒక్కొక్కటి రూ.1000 చొప్పున 2ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశా. కానీ, ఎస్బీఐ రిలీజ్ చేసిన డేటాలో 20 అక్టోబర్ 2020లో కొన్నట్లు చూపారు. ఇది పొరపాటున జరిగిందా? లేక నా పేరుతో ఉన్న ఇంకెవరైనా బాండ్‌ను కొన్నారా? చెప్పాలి’ అని SBIని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.