India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హీరో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాను విడుదల చేయకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.
ఏపీలోని 164 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ స్కూళ్లలో బోధన పూర్తిగా ఉచితం. CBSE సిలబస్, ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. ఐదో తరగతి పూర్తైన విద్యార్థులకు ఎగ్జామ్ నిర్వహించి, అర్హత సాధించిన వారికి సీట్లు కేటాయిస్తారు. చివరి తేదీ: మార్చి 31. ఎంట్రన్స్ టెస్ట్: ఏప్రిల్ 21. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం. పూర్తి వివరాలకు: https://apms.apcfss.in/
ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు ఎలక్టోరల్ ట్రస్టుల విరాళాలూ ఎక్కువగా బీజేపీకే అందినట్లు తెలుస్తోంది. 2022-23లో ఐదు ట్రస్టులు పార్టీలకు రూ.366కోట్లు ఇవ్వగా.. వీటిలో రూ.259కోట్లు బీజేపీకే వెళ్లాయి. అత్యధిక బాండ్స్ విరాళమిచ్చిన సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న మేఘా ఇంజినీరింగ్ ప్రూడెంట్‌కు (బీజేపీ మద్దతుదారు) రూ.87కోట్లు ఇచ్చింది. FY17 నుంచి ప్రూడెంట్‌కు వచ్చిన కార్పొరేట్ డొనేషన్లలో 85% బీజేపీకే వెళ్లాయి.
ఇదే తరహాలో బడా కంపెనీలు నిధులిచ్చే అనేక ఎలక్టోరల్ ట్రస్టులు సైతం బీజేపీకి భారీగా ఫండ్స్ ఇచ్చాయి. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్ స్కీమ్‌ను 2013లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్‌కు చెందిన వ్యక్తులు/కంపెనీలు డొనేట్ చేయొచ్చు. దాతల వివరాలు ఈసీకి కచ్చితంగా వెల్లడించాలనే నిబంధన ఉండటంతో ట్రస్టుల్లో బాండ్స్ కంటే ఎక్కువ పారదర్శకత ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ట్రాక్ రికార్డు బాగుంది. మేం చేసిన పనులే గెలిపిస్తాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. అబ్‌కి బార్ 400 పార్. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈసారి కూడా వాళ్లకు ఓటమి తప్పదు’ అని ఆయన ట్వీట్ చేశారు.
AP: రాష్ట్రంలో మే 13న ఎన్నికల జరగనుండటంపై TDP చీఫ్ చంద్రబాబు స్పందించారు. ‘ఐదేళ్లుగా 5 కోట్ల మంది ఈ రోజు కోసమే ఎదురుచూశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక పోలింగే మిగిలింది. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు వచ్చింది. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే’ అని ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అయితే సుప్రీంలో కేసు పెండింగ్‌లో ఉండగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తరఫు లాయర్ వాదించారు. దీంతో జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.
బాల్యంలో తన తండ్రి తనను దారుణంగా కొట్టేవారని, 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చినట్లు ప్రముఖ నటుడు రవి కిషన్ తెలిపారు. ‘మాది సంప్రదాయ కుటుంబం. నాన్న వ్యవసాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమన్నారు. ఒకసారి నాటకంలో సీత పాత్ర వేశాను. దాంతో ఆయన నన్ను తీవ్రంగా కొట్టారు. ఒకానొక సమయంలో నన్ను చంపాలనుకున్నారు. చిన్నతనంలో నన్ను కొట్టినందుకు చివరి రోజుల్లో నాన్న చాలా బాధపడ్డారు’ అని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి సరిగ్గా 59వ రోజు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు మే 11 సాయంత్రం 5 గంటలకు వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగనుంది.
యూపీ, బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రాల విస్తీర్ణం, హింసాత్మక, మావో ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతలు, ఛత్తీస్‌గఢ్, అస్సాంలో 3 విడతలు, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు విడతలు, మిగతా 22 రాష్ట్రాలు/UTల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.