India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.

ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో సుమారు 500, ముంబైలో 200 ఫ్లైట్స్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ అటాక్‌లో భాగమైన <<18227204>>జీపీఎస్ స్పూఫింగే<<>> దీనికి కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన BJP నేతలు బిహార్ తొలి దశలోనూ ఓటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హరియాణాలో ఓట్ చోరీకి సంబంధించిన ఆధారాలను సమర్పించామని తెలిపారు. ‘హరియాణాలో 2 కోట్ల ఓటర్లలో 29 లక్షల మంది ఫేక్. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణాలో BJP ఓట్ చోరీకి పాల్పడింది. దాన్ని బిహార్‌లో రిపీట్ చేయాలని వారు చూస్తున్నారు. ఇక్కడి ప్రజలు అలా జరగనివ్వరు’ అని అన్నారు.

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.

<

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.