India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ మూడు కొత్త చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి జంటగా నటించిన ‘జాక్’, అజిత్-త్రిష కీలక పాత్రలు పోషించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రాలన్నీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా రూపొందిన ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్‌లు, ఇతర మీడియా కంటెంట్‌ను మన దేశంలో బ్యాన్ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.
సరిహద్దుల్లో సైనికులు రేయింబవళ్లు గస్తీ కాస్తుండటం వల్లే మనం క్షేమంగా ఉంటున్నాం. ప్రత్యర్థులు తూటాలు సంధిస్తున్నా మన జవాన్లు ముందుండి ధైర్యంగా పోరాడుతున్నారు. ఆ సమయంలో కొందరు సైనికులు చనిపోయి కుటుంబానికి శోకాన్ని మిగుల్చుతుంటారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో మన సైనికులకు ఎలాంటి హానీ జరగొద్దని, వారు క్షేమంగా ఉండాలని మనమంతా ప్రార్థిద్దాం. వారంతా మన ఫ్యామిలీనే అని గుర్తిద్దాం. ‘జైహింద్’ COMMENT
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
వేసవిలో విరివిగా దొరికే మామిడి పండ్లు ఇష్టపడనివారుండరు. అయితే, మార్కెట్‌లో దాదాపు 37 రకాల మామిడి పండ్లున్నాయనే విషయం చాలామందికి తెలియదు. అందులో కొన్ని.. బంగినపల్లి, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, అంటు మామిడి, బెంగుళూరు మామిడి, రసాలు, చెరకు రసాలు, షోలాపూరి, అల్ఫాన్సా, నూజివీడు రసం, పంచదార కలశ, కోలంగోవా, ఏండ్రాసు, సువర్ణరేఖ, పండూరివారి మామిడి, కొండమామిడి.
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఫోకస్ చేసింది. ఈ కుంభకోణంపై సీఐడీ అధికారులు నమోదు చేసిన FIR వివరాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉందని అధికారులు గుర్తించిన వారి బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను అందజేయాలని లేఖ రాసింది. అరెస్టయిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, వారిపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి ఉంటే ఆ కాపీలనూ అందజేయాలంది.
లాహోర్, రావల్పిండి నగరాల్లో భారత దాడుల తీవ్రత ఊహాతీతం. ఆర్థిక నష్టాన్ని పక్కన పెడితే మన సైన్యం శత్రుదేశం నాభికి గురిపెట్టి నాశనం చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ బ్యాటరీలను బూడిద చేయడం తెలిసిందే. అంటే మన క్షిపణులు దాడిచేస్తే ఆపలేరు. వాళ్లు ప్రయోగించాలంటే బ్యాటరీలు ఉండవు. రెంటికీ చెడ్డ రేవడిగా మారిన పాక్ దీన్నుంచి కోలుకోవడం సులువేం కాదని నిపుణుల అంచనా. మీరేమంటారు?
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించారు.
ఇవాళ పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని మన <<16347393>>S-400<<>> సుదర్శన్ చక్ర క్షిపణి వ్యవస్థ అడ్డుకున్న విషయం తెలిసిందే. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే.. 360 డిగ్రీల సర్వైలెన్స్‌తో 600 కి.మీ.దూరంలోని 300 లక్ష్యాలను ట్రాక్ చేసి దాడులను నిర్వీర్యం చేస్తుంది. అలాగే, ఒకేసారి 36 లక్ష్యాలపై మిస్సైల్స్‌ను సంధించగలిగే శక్తి ఉంది. S-400 స్క్వాడ్రన్లలో ఒకటి J&K- పంజాబ్‌ను, మరొకటి గుజరాత్-రాజస్థాన్‌ను కవర్ చేస్తున్నాయి.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీలో ‘డ్రాగన్’ మూవీ భామ కయాదు లోహర్ నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇటీవల విడుదలైన డ్రాగన్ మూవీలో కయాదు పేరు మార్మోగింది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది.
Sorry, no posts matched your criteria.