India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపరుచుకోనుంది.
DC: డుప్లెసిస్, పోరెల్, KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, మాధవ్ తివారీ, స్టార్క్, చమీరా, కుల్దీప్, నటరాజన్
PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, అజ్మతుల్లా, చాహల్
పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు ఐక్యరాజ్య సమితిలో US మాజీ అంబాసిడర్ నిక్కీ హేలీ మద్దతు ప్రకటించారు. ‘టెర్రరిస్టులు డజన్ల కొద్దీ భారతీయులను చంపారు. ప్రతీకారం తీర్చుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఇండియాకు హక్కు ఉంది. తాము బాధితులమంటూ పాకిస్థాన్ చేసే నాటకాలు ఆపాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ దేశమూ సపోర్ట్ చేయకూడదు’ అని ట్వీట్ చేశారు.
పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు ధర్మశాలలో భారత సైన్యానికి బీసీసీఐ సంఘీభావం తెలియజేసింది. నిన్న పాక్ విచక్షణ రహిత దాడిలో మరణించిన సైనికుడికి నివాళి తెలిపింది. ఈ క్రమంలో ఓ బృందం జాతీయ జెండాలతో మైదానంలో తిరగడంతో పాటు దేశభక్తి గీతాలను ఆలపించింది.
TG: దాయాది దేశం పాకిస్థాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత సైన్యానికి సంఘీభావంగా చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మేం తలచుకుంటే పాక్ ప్రపంచ పటంలో ఉండదు. మట్టిలో కలిపేస్తాం. కానీ సంయమనం పాటిస్తున్నాం. మీకు స్వాతంత్ర్యం ఇచ్చింది మేమే. మా దేశ సిందూరాన్ని మీరు తుడిచివేయాలని అనుకుంటే ఆపరేషన్ సిందూర్‌తో మీకు బదులిచ్చాం’ అని పేర్కొన్నారు.
ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమని తెలిసినా ఎవ్వరూ లెక్కచేయట్లేదు. దీని వల్ల ఏటా 7.5 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం వల్ల రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. భారత్‌లో ఆల్కహాల్ వల్ల 62వేలు, చైనాలో 2.8లక్షల మందికి ఈ క్యాన్సర్లు సోకుతున్నట్లు వెల్లడించారు. మద్యపానాన్ని నివారించడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు 2027 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆడాలని ఉంది. అదే జరిగితే అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు. కాగా వన్డే వరల్డ్ కప్ గెలవడం తన కల అని రోహిత్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. 2023లో ఫైనల్ వరకు వెళ్లి ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయారు. ఇప్పటికే ఆయన టీ20లకూ రిటైర్మెంట్ ప్రకటించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి, ప్రధానులకు, CJI సంజీవ్ ఖన్నా అందజేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ వర్మ వాదనలను జత చేస్తూ లేఖ రాశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు బయటపడింది. దీంతో విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది.
TG: రాబోయే మూడు గంటల్లో ములుగు, మహబూబ్ నగర్, సూర్యాపేట్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెంలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. Dy.CM భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత తరలివచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకూ ప్రభుత్వం ర్యాలీ చేపడుతోంది.
Sorry, no posts matched your criteria.