India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ANR జాతీయ అవార్డు ఫంక్షన్లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల జాయింట్ అకౌంట్‌కు రూ.895 కోట్లు రిలీజ్ చేసింది. పట్టణ ప్రజలకు 24 గంటల్లో, గ్రామీణ ప్రజలకు 48 గంటల్లో DBT ద్వారా డబ్బులు జమచేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వనుంది. కాగా ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
TG: రాష్ట్రంలో పబ్‌ల నిర్వహణపై హైకోర్టు కీలక సూచనలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఇతర ప్రాంతాల్లోని పబ్‌లకు నిబంధనలు విధించాలని ఏఏజీకి సూచించింది. బడాబాబుల పిల్లలు పబ్‌ల వద్ద హంగామా చేస్తున్నారని, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణాలు తీస్తున్నారని పేర్కొంది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలంది.
ఈసారి దీపావళికి బాక్సాఫీస్ వద్ద బడా హీరోల మోతలు లేవు. ‘క’, లక్కీ భాస్కర్, అమరన్, బఘీర వంటి విభిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ‘క’ థ్రిల్లర్ నేపథ్యంలో, లక్కీ భాస్కర్ విభిన్న కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ‘అమరన్’ జవాన్ జీవిత కథ ఆధారంగా, బఘీర యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కాయి. వీటితో పాటు భూల్ భులయ్యా-3, జీబ్రా వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?
TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO) హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని ప్రకటనలో తెలిపారు. పోలీసులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్, షేర్ చేయవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులపై దర్యాప్తు సంస్థలకు మొదటి లీడ్ లభించినట్టుగా తెలుస్తోంది. గత రెండు వారాల్లో వచ్చిన 400లకు పైగా నకిలీ బెదిరింపుల్లో 90% వరకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు VPN, డార్క్ వెబ్ అడ్రస్‌ల ద్వారా కౌంటర్ టెర్రరిజమ్ డివిజన్ గుర్తించగలిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో NIA కూడా దర్యాప్తు చేస్తోంది.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి.
AP: విశాఖ నుంచి ముంబై బయల్దేరాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యాహ్నం 3.10 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో ఇప్పటివరకు ఫ్లైట్ విశాఖలోనే ఉండిపోయింది. కాగా ఇటీవల దేశంలో వందల సంఖ్యలో విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి.
ఏదోచోట తరచూ వినే పదాల అర్థాలు తెలుసుకుందాం. పంచేంద్రియాలు అంటే కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. పంచభూతాలు అంటే భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. పంచప్రాణాలు అంటే ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము. పంచారామాలు అంటే ద్రాక్షారామం, కుమారరామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. పంచలోహాలు అంటే బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము. లలితకళలు అంటే కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం. SHARE IT
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలు సంస్థలకు చెందిన మరో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు తమను భయపెట్టలేవని, ఇజ్రాయెల్ నిరంకుశత్వాన్ని వెలికితీయకుండా జర్నలిస్టులను నిలువరించలేవని గాజాలోని ప్రభుత్వ మీడియా ఆఫీస్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటిదాకా 176 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Sorry, no posts matched your criteria.