India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.
ఈ ఏడాది రిలీజైన లోబడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (₹50 కోట్లు) రూ.303 కోట్లు రాబట్టింది. ‘మహావతార్ నరసింహ’(₹15Cr) చిత్రం రూ.315కోట్లు, అహాన్ పాండే ‘సైయారా’ మూవీ (₹40Cr) రూ.569+ కోట్లు కలెక్ట్ చేశాయి. అలాగే మోహన్ లాల్ ‘తుడరుమ్’(₹35కోట్లు)కు రూ.235కోట్లు, దుల్కర్ నిర్మించిన ‘కొత్త లోక’ (₹30Cr) మూవీకి రూ.185+కోట్లు వచ్చాయి. ఇందులో మీకేది నచ్చింది?
TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, HYD, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, NZB, పెద్దపల్లి, సిరిసిల్ల, RR, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, WGL, భువనగిరి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది.
లక్షలాది ప్రయాణికుల భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే లోకో పైలట్ నియామకంలో రిజర్వేషన్లు ఉండొద్దని ఓ ప్రొఫెసర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. సిగ్నల్స్, రూట్స్, ఇంజిన్ నియంత్రణకు బాధ్యత వహించే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్‌ను తక్కువ మార్కులొచ్చిన వారికి ఎలా ఇస్తారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లో URకు 66.66 మార్కులు కట్ఆఫ్‌గా ఉంటే BC & EWSలకు 40, SCలకు 34, STలకు 25 మార్కులు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్?
AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్-చాందీపూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/
AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 95 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లైకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
<
TG: గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గ్రూప్-1 నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై పిటిషన్లు వేసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఎంపికైనవారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాలను రద్దు చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.