News September 9, 2025

హైకోర్టు తీర్పు: అటు హర్షం.. ఇటు ఆవేదన

image

TG: గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గ్రూప్-1 నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై పిటిషన్లు వేసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఎంపికైనవారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాలను రద్దు చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2025

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు

image

TG: గ్రూప్-1పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని TGPSCని ఆదేశించింది. అది సాధ్యం కాకపోతే పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలిపింది. అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారందరికీ అవకాశం కల్పించాలని సూచించింది. 8 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.

News September 9, 2025

ఎంపీలతో సీఎం రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. సరైన విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.

News September 9, 2025

పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్ క్లాసులు.. సైకాలజిస్టు ఏమన్నారంటే?

image

పిల్లలను IIT ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పిస్తూ కొందరు ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని సైకాలజిస్ట్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పిల్లల మెదడు/మనసు కొన్ని విషయాలని ఓ వయసు వచ్చేవరకూ అర్థం చేసుకోలేవు. దీన్ని సైకాలజిస్టు జీన్ పియాజే చాలా ఏళ్ల క్రితం అధ్యయన పూర్వకంగా నిరూపించారు. దానికి తగ్గట్లే బడిలో మన పాఠ్యాంశాలుంటాయి. ఇప్పుడు నువ్వు ఐదో తరగతిలో ఐఐటీ అంటే వెధవ ఎవడిక్కడ?’ అని విమర్శించారు.

News September 9, 2025

RECORD: తొలిసారి రూ.లక్ష దాటిన 22 క్యారెట్ గోల్డ్ రేటు

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో చరిత్రలో తొలిసారి 24 క్యారెట్ల బంగారం రూ.1.10లక్షలు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10g పసిడి ధర రూ.1,360 పెరిగి రూ.1,10,290కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1250 ఎగబాకి రూ.1,01,100 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 9, 2025

CDFDలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్, బీఈ, పీజీ, డిప్లొమా, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News September 9, 2025

నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

image

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.

News September 9, 2025

కార్తీక్ ఆర్యన్ ఇంట్లో శ్రీలీల పూజలు.. పిక్స్ వైరల్

image

డేటింగ్ రూమర్స్ వేళ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ ఆర్యన్ ఇంట్లో హీరోయిన్ శ్రీలీల వినాయక చవితి పూజలు చేశారు. ఈ వేడుకలకు శ్రీలీల తల్లి కూడా హాజరుకావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య రిలేషన్ కన్ఫామ్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కార్తీక్-శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నారు.

News September 9, 2025

రివర్స్ వాకింగ్ చేస్తే ప్రయోజనాలు ఇవే!

image

రివర్స్ వాకింగ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘వెనక్కి నడవడం వల్ల ముందుగా కాలి వేళ్ల భాగం, ఆ తర్వాత పాదం మొత్తం నేలకు ఆనుకుంటుంది. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అయ్యి బరువు తగ్గొచ్చు. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్ను నొప్పి, మెడనొప్పి, గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది’ అని చెబుతున్నారు.

News September 9, 2025

జూబ్లీహిల్స్ బరిలో గోపీనాథ్ సతీమణి?

image

TG: మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. BRS సెంటిమెంట్‌గా గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మాగంటి సునీత గోపీనాథ్ పేరిట నిత్యం పోస్టులు చేస్తున్నారు. మరోవైపు తన ఇద్దరు కూతుళ్లు అక్షర, దిశిరను జనాల్లోకి పంపుతున్నారు. వారు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ మమేకమవుతున్నారు.