News July 4, 2025

పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

image

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

News July 4, 2025

గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

image

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.

News July 4, 2025

అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

image

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.

News July 4, 2025

దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

image

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News July 4, 2025

AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

image

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

News July 4, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.

News July 4, 2025

మథుర ‘షాహీ దర్గా’ పిటిషన్ కొట్టివేత!

image

శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ముస్లిం సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది. కృష్ణ జన్మభూమిపై హిందూ సంఘాలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.

News July 4, 2025

కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: దాసోజు శ్రవణ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ Way2Newsకు తెలిపారు. KCRకు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సాధారణ నీరసానికే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై పోరాటానికి సిద్ధమవుతున్నారని దాసోజు పేర్కొన్నారు. కాగా సోడియం లెవెల్స్ పడిపోవడంతో కేసీఆర్ చికిత్స తీసుకుంటున్నారు.

News July 4, 2025

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

image

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 4, 2025

పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

image

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.