India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.55%, 3 నెలలకు 8.60%, 6 నెలలు, ఏడాదికి 8.65%, రెండేళ్ల వ్యవధికి 8.70%, మూడేళ్లపై 8.75 శాతంగా ఉంటుంది. ఫలితంగా బ్యాంకులో తీసుకున్న లోన్లపై వడ్డీ తగ్గుతుంది. HDFCలో హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 7.90% నుంచి 13.20శాతంగా ఉంది.
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో పీఎం మోదీ ఇవాళ పర్యటించనున్నారు. తొలుత మ.1.30 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం ధర్మశాలలో అధికారులతో రివ్యూ నిర్వహించి, సూచనలు చేయనున్నారు. ఇక సాయంత్రం 4.15 గంటలకు పంజాబ్‌లోని గర్దాస్‌పూర్ చేసుకుంటారు. అక్కడ కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు.
ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని కాళోజీ నారాయణరావు జయంతి నేడు. తన రచనల ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష, ప్రజల కష్టాలను ప్రపంచానికి చాటిన ఆయన జయంతిని ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా నిర్వహిస్తోంది. ఆయన నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై ధైర్యంగా గళమెత్తారు. ఆయన రచనల్లో ‘నా గొడవ’ అనే కవితా సంపుటి తెలంగాణ ప్రజల పోరాటాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. *జోహార్ కాళోజీ
AP: రాష్ట్రంలో యూరియా కొరతపై YCP ‘అన్నదాత పోరు’ పేరిట ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని RDO కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంటలకు ఉచిత బీమాను పునరుద్ధరించాలని, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని అధికారులకు YCP నేతలు వినతి పత్రాలు అందించనున్నారు.
వరుస కాపీ రైట్ కేసులతో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన పర్మిషన్ లేకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తాను కంపోజ్ చేసిన సాంగ్స్ వాడారని ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ప్రసారాన్ని ఆపాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ఆదేశించింది. గతంలో ‘మంజుమ్మల్ బాయ్స్’, ఇటీవల ‘కూలీ’ చిత్రాలపై కూడా ఆయన కేసు వేశారు.
తమిళనాడుకు చెందిన ఓ లేడీ సర్పంచ్ 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు సర్పంచ్ భారతి(DMK) ఇటీవల బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ మెడలో గోల్డ్ చైన్ చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ను అరెస్ట్ చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్నా దొంగతనం చేసినప్పుడు వచ్చే కిక్కే వేరని, అందుకే చోరీలు చేస్తున్నానని పోలీసుల విచారణలో ఆమె చెప్పడంతో అందరూ విస్తుపోయారు.
AP: రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇక నుంచి 14.2 కేజీల LPG సిలిండర్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘దీపం-2’ పథకం కింద ప్రస్తుతం 5Kgs సిలిండర్లను ఇస్తుండగా, వాటి స్థానంలో 14.2Kgs సిలిండర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంటేషన్ ఛార్జీల కోసం ₹5.54Cr కేటాయించింది. ఈ నిర్ణయంతో 23,912 మందికి లబ్ధి చేకూరనుంది.
AP: సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ CM, సినీ నటుడు NTR విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో Dy,CM పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ IAS విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు. ఈ నెల 15కు విచారణ వాయిదా వేశారు.
TG: యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లోనూ నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సజావుగా సాగుతున్నట్లు వెల్లడించారు. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశీయ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.
ఈనెల 22 తర్వాత GST కొత్త <<17605492>>శ్లాబులు<<>> అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో ‘ఏది కొనాలన్నా ఆ తర్వాతే’ అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఇక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.
Sorry, no posts matched your criteria.