India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్‌లో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి. ఈ పదవిని చేపట్టిన వారు రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ సభ సజావుగా, గౌరవప్రదంగా సాగేలా చూస్తారు. సభలో తటస్థంగా ఉంటారు. వీరు బిల్లులపై ఓటేసేందుకు వీలుండదు. ఎప్పుడైనా టై అయితే మాత్రమే కాస్టింగ్ ఓటు వేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఏదైనా కారణంతో రాష్ట్రపతి సీటు ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలికంగా రాష్ట్రపతి విధులను చేపట్టవచ్చు.
AP: రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘వైసీపీ హయాంలో చంద్రబాబును జైలులో పెట్టారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జగన్‌ను జైలుకు పంపుతారా?’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసే వాళ్లం. కానీ మా దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉంది. నేనైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇవాళ జరగనుంది. ఓటింగ్ ఉ.10 గంటలకు ప్రారంభమై సా.5 గంటలకు ముగుస్తుంది. సా.6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ, రాజ్య సభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా, 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. NDA ఆ మార్క్ కంటే ఎక్కువ మంది సభ్యుల్ని (422) కలిగి ఉండటం గమనార్హం.
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కవర్ అయ్యేలా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(EHS) విధానాన్ని రూపొందించాలని అధికారులను CS కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలను, బీమా కంపెనీ పాలసీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలన్నారు. దీని ద్వారా 7,14,322 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని, ఏడాదికి సుమారు ₹1,300Cr ఖర్చవుతుందని అంచనా వేశారు.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటి పానీయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. బార్లీ వాటర్ కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తుంది. గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్ కిడ్నీలకు మేలు చేస్తాయి’ అని చెబుతున్నారు.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను తేలికగా తీసుకోబోమని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపారు. పాక్‌తో సవాలు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని, ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్/బౌలింగ్ చేసేలా ఆల్‌రౌండర్లకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది.
సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా యాప్‌ల నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1914: కవి కాళోజీ నారాయణరావు జననం (ఫొటోలో)
1935: కూచిపూడి నృత్య కళాకారుడు, రంగస్థల నటుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1978: కవి, కథా రచయిత ఆలూరి బైరాగి మరణం
2003: భారత మాజీ క్రికెటర్ గులాబ్‌రాయ్ రాంచంద్ మరణం
☛ తెలంగాణ భాషా దినోత్సవం
✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
✒ ఇష: రాత్రి 7.36 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.