News September 9, 2025

హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రధాని మోదీ రూ.1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నష్ట తీవ్రతపై అధికారులతో సమీక్షించారు. వరదలు, ప్రకృతి విపత్తులో చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాసేపట్లో ప్రధాని పంజాబ్‌‌కు చేరుకోనున్నారు.

News September 9, 2025

Way2News కాన్‌క్లేవ్: వైసీపీ నుంచి బుగ్గన, సజ్జల

image

AP: విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్‌క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్‌క్లేవ్ ఇదే.

News September 9, 2025

INSPIRING: ట్రాన్స్‌జెండర్‌ నుంచి ఫొటో జర్నలిస్టు!

image

రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ట్రాన్స్‌జెండర్ జోయా థామస్ లోబో జీవితాన్ని పేపర్‌లో వచ్చిన ఫొటోగ్రాఫర్ కథనం మార్చేసింది. తానూ ఫొటోగ్రాఫర్ అవ్వాలని ఓ కెమెరా కొని దానితో ట్రాన్స్‌ల జీవితాలపై డాక్యుమెంటరీ చేశారు. ఓ మూవీలోని హిజ్రా పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవడంతో ఓ వార్తాసంస్థ రిపోర్టర్ ఉద్యోగం ఇచ్చింది. లాక్డౌన్‌లో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కట్టేలా తీసి ఫొటో జర్నలిస్టుగా మారారు.

News September 9, 2025

2035లో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’: ఇస్రో ఛైర్మన్

image

ఇస్రో భవిష్యత్ కార్యాచరణ గురించి ఛైర్మన్ వి.నారాయణన్ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం ఉన్న వాటి కంటే 3 రెట్లు అధికంగా శాటిలైట్స్‌ను కక్ష్యల్లో ప్రవేశపెడతాం. చంద్రయాన్-4, 5 మిషన్స్‌పై దృష్టిపెట్టాం. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ స్థాపిస్తాం. 2028లో ఫస్ట్ మాడ్యూల్ పంపిస్తాం. 2040లో ఇండియా చంద్రుడిపై అడుగు పెడుతుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతాం’’ అని మీడియాకు తెలిపారు.

News September 9, 2025

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..

image

ఈరోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆఫీస్, ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిపనుల్లో కుటుంబసభ్యుల సాయం తీసుకోండి. ఆఫీస్‌లో వర్క్‌లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడాలి. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటితోపాటు కుటుంబంతో సరదాగా సమయం గడపడమూ ముఖ్యమే.

News September 9, 2025

కలర్ కరెక్ట్ చేద్దాం..

image

ముఖంపై వివిధకారణాల వల్ల మచ్చలు వస్తాయి. నుదురు, గడ్డంపై టాన్, బ్లాక్ సర్కిల్స్, పెదవుల చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటే కన్సీలర్, కలర్ కరెక్టర్ కలిపి అప్లై చెయ్యాలి. చర్మం కమిలినపుడు గ్రీన్ కరెక్టర్, కన్సీలర్ కలిపి వేయాలి. మొటిమలు తగ్గినపుడు ఉండే ఆరెంజ్ మచ్చలకు బ్లూ కరెక్టర్, నుదురు, గడ్డంపై లైట్ ఎల్లో మచ్చలకు పర్పుల్ కరెక్టర్ వాడాలి. లాస్ట్‌లో ఫౌండేషన్, పౌడర్ అద్దితే ముఖం మచ్చల్లేకుండా మెరిసిపోతుంది.

News September 9, 2025

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’

image

AP: యూరియా కొరత ఉందంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టింది. పలు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించిన YCP నేతలు యూరియా కొరతపై అధికారులకు వినతులు సమర్పించారు. ‘యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 9, 2025

తండ్రి ఆస్తిలో వాటా కోరుతున్న హీరోయిన్ పిల్లలు!

image

హీరోయిన్ కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తిలో వాటా కోరుతున్నారు. రూ.30,000 కోట్ల విలువ చేసే సోనా గ్రూపులో తమకూ హక్కు ఉందని వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా సంజయ్, కరిష్మా 2016లో విడిపోయారు. వీరిద్దరికీ సమీరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు సోనా గ్రూపును దక్కించుకునేందుకు సంజయ్ మూడో భార్య ప్రియా సచ్‌దేవ్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు

image

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.

News September 9, 2025

BREAKING: నేపాల్ ప్రధాని రాజీనామా

image

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.