News July 4, 2025

సిద్ధార్థ్ ‘3 BHK’ మూవీ రివ్యూ&రేటింగ్

image

తన తండ్రి సొంతిల్లు నిర్మించాలనే కలను హీరో నెరవేర్చాడా లేదా అన్నదానిపై ‘3 BHK’ మూవీని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ ఫరవాలేదనిపించాయి. డైరెక్టర్ శ్రీ గణేశ్ స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సాంగ్స్ అలరించలేదు. కథను ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు పదేపదే వస్తూ సీరియల్‌ను తలపిస్తాయి. రేటింగ్: 2.25/5

News July 4, 2025

పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

image

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.

News July 4, 2025

ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.

News July 4, 2025

ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

image

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్‌పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

News July 4, 2025

డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

image

కీర్తి సురేశ్, సుహాస్ జంటగా నటించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. డైరెక్టర్ అని IV శశి తెరకెక్కించిన ఈ మూవీకి స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. ఓ గ్రామంలో ఎదురైన అసాధారణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథ.

News July 4, 2025

భోగాపురం ఎయిర్‌పోర్ట్ తాజా ఫొటోలు

image

AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి వరమైన అల్లూరి సీతారామరాజు(భోగాపురం, VZM) ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ATC టవర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిత్యం 5,000 మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8కి.మీ పొడవైన ఈ రన్‌వేపై తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు.

News July 4, 2025

ఒక్క బిడ్డకు జన్మనిస్తే రూ.1.30 లక్షలు!

image

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ఓ పథకం ప్రవేశపెట్టనుంది. ఒక్కో బిడ్డను కంటే ఏడాదికి 3,600 యువాన్లు (రూ.43 వేలు) రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లపాటు ఈ నగదు ప్రోత్సాహాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనాలోని మంగోలియా ప్రాంతంలో రెండో బిడ్డను కంటే రూ.6లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు ఇస్తున్నారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఫలితంగా జననాల రేటు పడిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంటోంది.

News July 4, 2025

KCR లేటెస్ట్ ఫొటోలు

image

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.

News July 4, 2025

ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

image

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.

News July 4, 2025

వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: చంద్రబాబు

image

AP: రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను OCT 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.