News November 7, 2025

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ<<>>లో 24 అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. M.Phil/PhD అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి. వెబ్‌సైట్: https://svuniversityrec.samarth.edu.in

News November 7, 2025

హనుమాన్ చాలీసా భావం – 2

image

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 7, 2025

హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్‌స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 7, 2025

కోహ్లీ, బాబర్‌కు తేడా అదే: పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెట్‌పై బాబర్ ఆజమ్ ఎంతో ప్రభావం చూపారని ఆ దేశ క్రికెటర్ ఆజం ఖాన్ అన్నారు. ‘బౌలింగ్‌కు పేరుగాంచిన పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌ విషయంలో బాబర్ ఫేమస్ చేశారు. అచ్చం ఇండియా కోసం కోహ్లీ చేసినట్లే. అయితే కోహ్లీ కెరీర్ ప్రారంభంలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ వంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ బాబర్‌కు ఎవరున్నారు? అతడు ఎంతో భారం మోయాల్సి వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News November 7, 2025

ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

image

<>ఏపీ గ్రామీణ బ్యాంకు<<>>లో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కు రూ.30వేల జీతం చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apgb.bank.in

News November 7, 2025

బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

image

బిహార్‌లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.

News November 7, 2025

ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

image

HYDలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకానుంది. చారిత్రక లార్డ్స్, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి దిగ్గజ స్టేడియాలకు తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీలో 2 ఏళ్లలో దీన్ని తీర్చిదిద్దాలని CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు ‘వే2న్యూస్’కు అధికారులు తెలిపారు. దీనిపై అధ్యయనానికి మాజీ క్రికెటర్లతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రవాణా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని RR(D) కందుకూరులో ఏర్పాటుచేసే అవకాశముంది.

News November 7, 2025

Fact Check: పాత ₹500, ₹1,000 నోట్లు మార్చుకోవచ్చా?

image

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.

News November 7, 2025

15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

image

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.

News November 7, 2025

ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

image

జాతీయ స్థాయి వాలీబాల్‌ ప్లేయర్‌గా‌ ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.