India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో కెమికల్ పౌడర్‌తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్‌ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.

ఢిల్లీలో 100కి పైగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. IGIA ఎయిర్‌పోర్ట్ ATCలో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి కారణం. దీని వల్ల ఆన్‌బోర్డు, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. అత్యధిక విమానాల రాకపోకల్లో ఆలస్యం చర్చకు దారితీసింది. సమస్యను గుర్తించి పరిష్కరించామని, పరిస్థితి క్రమేణా సద్దుమణిగినట్లు ఎయిర్‌పోర్టు తెలిపింది. ఉత్తరాది ఎయిర్‌పోర్టులపైనా దీని ప్రభావం పడింది.

AP: e-KYC పూర్తి చేయించుకోని వారి రేషన్ కార్డులను రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ e-KYC చేయించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో చాలా మంది ఇంకా e-KYC చేయించుకోలేదని, డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే e-KYC పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.

Hong Kong Sixes 2025 టోర్నమెంట్‌లో అఫ్గానిస్థాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 6 ఓవర్ల మ్యాచులో ఏకంగా 148/2 చేసింది. కెప్టెన్ గుల్బదిన్ 12 బంతుల్లో 50, జనత్ 11 బంతుల్లో 46 రన్స్ చేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్స్ 400కు పైగానే ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 ఓవర్లలో 99 రన్స్ చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 25 సిక్సర్లు బాదారు.

ప్రతి జీవి కోరుకునేది ఆనందం. దాన్ని పొందడానికి మనిషి 2 విషయాలు చేస్తాడు. మొదటిది కోరుకున్న వాటిని పొందడం. అంటే మంచి చదువు, ఉద్యోగం, ఐశ్వర్యం. రెండోది ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం. అంటే అనారోగ్యం, అప్పులు అన్నమాట. ఈ రెండు కోరికలు నెరవేరడానికి ఏం చేయాలో వేదాలు బోధిస్తాయి. వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడమే కాక, కోరికలను నెరవేర్చుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి పరిష్కారం చూపుతాయి. <<-se>>#VedikVibes<<>>

AP: పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్టు Dy CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెపండగ 2.0లో 4007 KM రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణాలు నాణ్యతతో ఉండాలన్నారు. స్వమిత్వ పథకం ద్వారా గ్రామాల్లో MARకి కోటి మంది ఆస్తులకు యాజమాన్య హక్కు (ప్రాపర్టీ) కార్డులు అందించాలని సూచించారు.

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.

<
Sorry, no posts matched your criteria.