India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.
2021 మయన్మార్: ఎన్నికైన ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు
2022 శ్రీలంక: అప్పులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో ఆందోళనలు. ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స రాజీనామా
2024 బంగ్లాదేశ్: షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన. హసీనా రాజీనామాతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
>తాజాగా నేపాల్‌లో యువత ఆందోళన.. హోంమంత్రి రాజీనామా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. అల్లు అరవింద్ అమ్మ కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులూ హాజరయ్యారు. ఈ ఫొటోలను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. కనకరత్నం ఆశీస్సులు తమపై ఉంటాయని పేర్కొంది. కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
నేపాల్‌లో <<17651342>>హింసాత్మక ఘటనలు<<>> జరుగుతుండటంతో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అక్కడి యువత ఇవాళ ఆందోళనకు దిగింది. పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. 250 మందికి పైగా గాయాలయ్యాయి.
ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియా నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ అందుకున్నారు. ఇవాళ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రతినిధులతో ముంబై వెళ్లానని, అందులో భాగంగా NSEని సందర్శించానని పేర్కొన్నారు. NSE అధికారులు తన పట్ల చూపిన ఆత్మీయత, గౌరవం తన హృదయాన్ని తాకిందన్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించి బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని వివరించారు.
AP: సెప్టెంబర్ నెలకు సంబంధించి కేంద్రం నుంచి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కాకినాడ పోర్ట్ నుంచి 17,294, మంగళూరు పోర్ట్ నుంచి 5,400, జైగర్ పోర్ట్ నుంచి 10,800, విశాఖ పోర్ట్ నుంచి 15,874 మెట్రిక్ టన్నుల యూరియా 2 రోజుల్లో రాష్ట్రానికి వస్తుంది. వ్యవసాయ అధికారుల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. రైతులు ధైర్యంగా ఉండాలి’ అని సూచించారు.
‘మామ్’ మూవీ షూటింగ్ సమయంలో శ్రీదేవి తన గదికి అస్సలు రానిచ్చేది కాదని ఆమె భర్త బోనీ కపూర్ తెలిపారు. ఆ పాత్ర పట్ల ఆమె ఎంత నిబద్ధతతో పనిచేసిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ‘ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. రెమ్యునరేషన్ ఎక్కువ అని వద్దనుకున్నాం. కానీ శ్రీదేవి తన పారితోషికం రూ.70 లక్షలు ఇచ్చి ఆయనను తీసుకురావాలని చెప్పారు’ అని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
AP: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూరియాపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. యూరియాపైనే కాదు మిగతా అన్ని సమస్యలపైనా చర్చిద్దాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈనెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.
వైద్యం వ్యాపారపరమైన ఈ రోజుల్లో ఓ వైద్యుడు లక్షలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి దైవంగా మారారు. నేపాల్‌కి చెందిన డా.సందుక్ రూయిట్ తన జీవితాన్ని పేదవారికి చూపును ప్రసాదించేందుకు అంకితం చేశారు. హిమాలయ పర్వతాల్లోని మారుమూల గ్రామాల నుంచి ఆసియా, ఆఫ్రికా అంతటా ఆయన సేవలు విస్తరించాయి. ఆయన ప్రారంభించిన ‘హిమాలయన్ క్యాటరాక్ట్ ప్రాజెక్ట్’ 14లక్షలకు పైగా రోగులకు చికిత్స చేసింది.
Sorry, no posts matched your criteria.