News July 5, 2025

కుర్రాడు ఇరగదీస్తున్నాడు!

image

INDతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేమీ స్మిత్ అదరగొడుతున్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో 207 బంతుల్లోనే 4 సిక్సర్లు, 21 ఫోర్లతో 184 రన్స్ చేశారు. ఎక్కడా తడబడకుండా అటాకింగ్ బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు. తొలి టెస్టులో 84 రన్స్ చేశారు. 24 ఏళ్ల స్మిత్ 2019లో ఫస్ట్ క్లాస్ సెంచరీ బాదారు. గతేడాది టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు.

News July 5, 2025

పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.

News July 4, 2025

PHOTO: గోల్కొండ కోట అందం చూశారా?

image

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చాలా ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోటను ఎప్పుడైనా మీరు ఆకాశంలో నుంచి చూశారా? దీని ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కోట నిర్మాణం అబ్బురపరుస్తోంది. బోనాల సందర్భంగా ఈ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.

News July 4, 2025

పనిమనిషి కుటుంబ ఆదాయం రూ.లక్ష!.. reddit పోస్ట్ వైరల్

image

తన ఇంట్లో పనిచేసే ఓ మహిళ కుటుంబం తనకంటే ఎక్కువ సంపాదిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయిన ఓ వ్యక్తి redditలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘మా పనిమనిషి ఇళ్లలో పనిచేయడం ద్వారా నెలకు రూ.30వేలు, కూలీగా ఆమె భర్త రూ.35వేలు, పెద్ద కొడుకు రూ.30వేలు, టైలరింగ్ చేస్తూ కుమార్తె రూ.3వేలు, చిన్న కొడుకు రూ.15వేలు సంపాదిస్తున్నాడు. ఇలా ఎలాంటి పన్ను చెల్లించకుండా నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.

News July 4, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడంటే?

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇతర నటీనటులతో సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రభాస్ నవంబర్ నుంచి షూట్‌లో పాల్గొంటారని మూవీ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News July 4, 2025

మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

image

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <>https://apdsc.apcfss.in<<>>లో కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ‘కీ’పై అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో ఈనెల 12వ తేదీలోగా DSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 28 వరకు జరిగిన పరీక్షల ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేశారు.

News July 4, 2025

ఈ స్కిల్స్ పెంచుకుంటే విజయం మీదే!

image

ఏ రంగంలోనైనా సక్సెస్ పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీ సొంతం అవుతుందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ తమ సంస్థాగత నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్ & ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ & నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ & క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పరిశోధన- విశ్లేషణ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, రైటింగ్స్ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని తెలిపారు.

News July 4, 2025

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

image

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్‌లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.

News July 4, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా? క్లారిటీ!

image

మొహర్రం పురస్కరించుకుని గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అయితే ఏపీలో రేపు స్కూళ్లకు రావాల్సిందేనని టీచర్లను అధికారులు ఆదేశించారు. పాఠశాలలోని 50% మంది టీచర్లు విధులకు రావాలని, పిల్లలకు యథావిధిగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. అటు తెలంగాణలో రేపు హాలిడే ఉంటుందని మెసేజులు రాలేదు. మరి మీకు రేపు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News July 4, 2025

టెన్త్ విద్యార్థులకు బహుమతిగా సైకిళ్లు: బండి సంజయ్

image

TG: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ప్రధాని మోదీ 20వేల సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈనెల 11న తన బర్త్‌డే సందర్భంగా 8, 9 తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. KNR, SRCL, JGL, SDPT, HNK జిల్లాల్లోని విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.4వేలు అని, వాటిపై PM ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.