News October 29, 2024

గోల్ఫ్ కోర్స్‌ ఏర్పాటుపై సీఎంతో చర్చించా: కపిల్ దేవ్

image

AP: క్రీడలపై CM CBN చాలా ఆసక్తి ఉన్నారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్‌ ఏర్పాటుపై CMతో చర్చించినట్లు చెప్పారు. అందుకు స్థలం ఎక్కడ ఇస్తారనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. AP అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరినట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతి, విశాఖ, అనంతపురంలో కోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

News October 29, 2024

YS అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ

image

AP: తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని విజయమ్మ అన్నారు. ‘జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధేస్తోంది. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరూ కల్పిత కథలు రాయొద్దు. వాళ్లిద్దరే(జగన్, షర్మిల) సమాధానం పొందుతారు. దేవుడు అన్నింటికీ పరిష్కారం చూపుతాడు’ అని తెలిపారు.

News October 29, 2024

అంతరించిపోయే దశలో ఆఫ్రికన్ పెంగ్విన్స్

image

నలుపు, తెలుపు రంగులలో విలక్షణంగా కనిపించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు IUCN తెలిపింది. ప్రపంచంలోని 18 పెంగ్విన్ జాతులలో అంతరించిపోయే దశకు చేరుకున్న మొదటి జాతి ఇదేనని పేర్కొంది. ఆహారం దొరకకపోవడం, వాతావరణ మార్పులు, సంతానోత్పత్తి కాలనీల సమీపంలో చేపల వేట కొనసాగించడం వీటి మనుగడకు పెను ముప్పుగా మారాయంది. వీటి సంరక్షణకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని IUCN కోరింది.

News October 29, 2024

ఎవరి పర్మిషన్ తీసుకోవాలో చెప్పండి సార్: మంత్రికి మందుబాబు లేఖ

image

TG: మద్యం తాగడానికి ఎవరి అనుమతి తీసుకోవాలో చెప్పాలని ఓ మందుబాబు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ‘మద్యం తాగాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని మీరు చెప్పారు. దీంతో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలంటే భయం వేస్తోంది. పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి. CM దగ్గరా? మీ వద్దనా? ఎక్సైజ్ శాఖ వద్దనా? ఒక క్లారిటీ ఇస్తే నా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటా’ అని సదరు మద్యం ప్రియుడు లేఖలో పేర్కొన్నారు.

News October 29, 2024

హీరో అక్షయ్ కుమార్ మంచి మనసు

image

అయోధ్యలోని కోతులకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు. వానరాలకు ఆహారం అందించేందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని ఆయన సమకూర్చారు. దాదాపు 1,200 కోతులకు ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు. నగరం బయట కొన్ని ప్రదేశాల్లో వాటికి ఫుడ్ అందిస్తారు. తన తల్లిదండ్రులు, మామ రాజేశ్ ఖన్నా పేరు మీదుగా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు.

News October 29, 2024

రాష్ట్రంలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్

image

TG: సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన జరిగింది. హుస్నాబాద్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా నిన్న ఆ చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులు బాధితురాలి కాలనీకి చెందినవారేనని గుర్తించారు. మరోవైపు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

News October 29, 2024

RUMOUR: ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇదేనా?

image

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, సలార్-2, ఫౌజీ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. వీటిని పూర్తిచేసి ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు. అయితే, ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘ప్రభాస్ పోలీసు పాత్రలో నటిస్తారు. కానీ కథలో మలుపుల కారణంగా ఆయన గ్యాంగ్‌స్టర్‌గా మారుతారు. భారీ వైల్డ్ ఎలిమెంట్స్ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయి’ అని పుకార్లు వినిపిస్తున్నాయి.

News October 29, 2024

వారానికి 4 రోజులే పనిచేస్తూ విజయం పొందారు!

image

పని భారం, ఎక్కువ గంటలు వర్క్ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ ఐస్‌లాండ్‌ వారానికి 4 రోజులే పని చేయిస్తూ విజయం పొందింది. 2020- 2022 మధ్య డేటాను సమీక్షించగా తక్కువ పని గంటలు ఐస్‌లాండ్ ఆర్థిక వ్యవస్థను యూరప్‌లోని బలమైన వాటిలో ఒకటిగా మార్చడంలో సహాయపడినట్లు తేలింది. వారానికి 35-36 గంటలు పనిచేయడంతో ఉద్యోగిపై ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడినట్లు గుర్తించారు.

News October 29, 2024

ఉమెన్స్ టీమ్ ఇండియా టార్గెట్ 233 రన్స్

image

భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ జట్టు 49.5 ఓవర్లు ఆడి 232 పరుగులు చేసింది. బ్లాక్ క్యాప్స్‌లో బ్రూక్ హాలీడే (86) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. ప్లిమ్మర్ (39), గేజ్ (25) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, రేణుక, సైమా ఠాకూర్ ఓ వికెట్ సాధించారు. భారత్ గెలవాలంటే 233 పరుగులు చేయాల్సి ఉంది.

News October 29, 2024

ఫ్రీగా రూ.5లక్షల ఇన్సూరెన్స్.. ఇలా అప్లై చేసుకోండి

image

ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా 70ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఉచితంగా రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌లో వయసును బట్టి అర్హులు <>PMJAY<<>> పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. తొలుత సైట్‌లోకి వెళ్లగానే ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ట్యాప్‌పై క్లిక్ చేయాలి. అనంతరం క్యాప్చా, ఫోన్ నంబర్, ఓటీపీ, కేవైసీ వివరాలు నమోదు చేయాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.