India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఒంటరిగా గెలవలేదని ఆ పార్టీ నేత, Dy.cm దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయితే అధిక సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్నారు. మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ NCPలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సీట్లు ఆశించిన కొందరికి అవకాశం దక్కకపోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.
✒ తేది: అక్టోబర్ 28, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:13 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:46 గంటలకు
✒ ఇష: రాత్రి 7.00 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: అక్టోబర్ 28, సోమవారం
✒ ఏకాదశి: ఉదయం 7.51 గంటలకు
✒ పుబ్బ: మధ్యాహ్నం 3.23 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 11.32- 1.21 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.14- 1.00 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: మధ్యాహ్నం 2.32- 3.19 గంటల వరకు
* TG: కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో పార్టీ.. డ్రగ్ టెస్టులో ఒకరికి పాజిటివ్
* ఫిర్యాదు వస్తేనే పోలీసుల సోదాలు.. మంత్రుల ప్రకటన
* రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ పార్టీ: KTR
* ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి
* AP: కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ పాపమే: టీడీపీ
* జగన్ ఓ విషపు నాగు: షర్మిల
* షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: VSR
తన కుక్క చనిపోవడానికి కారణమైందంటూ అలాస్కా ఎయిర్‌లైన్స్ సంస్థపై USకి చెందిన మైకేల్ కాంటిలో అనే వ్యక్తి దావా వేశారు. అతడి ఫిర్యాదు ప్రకారం.. న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు తన రెండు కుక్కలతో కలిసి ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లో మైకేల్ ప్రయాణిస్తున్నారు. అక్కడ కుక్కలు ఉండకూడదంటూ విమానం ఆఖరి సీటుకు సిబ్బంది వాటిని మార్చారు. దీంతో రెండు కుక్కల్లో ఒకటి ఊపిరాడక చనిపోయిందని మైకేల్ దావాలో ఆరోపించారు.
కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చికెన్ తిన్న వెంటనే పాలు తాగకూడదు. అలా చేస్తే శరీరంలో టాక్సిన్స్ ఏర్పడి కడుపునొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. బిర్యానీలో పెరుగు కలుపుకుని తినడం మంచిది కాదు. తేనె, డ్రింక్స్, పండ్ల రసాలు, బంగాళదుంపలు కూడా తినకూడదు. చికెన్ మితంగా తినడం మంచిది.
టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన కుమారుడికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అగస్త్య ఆడుకుంటుండగా హార్దిక్ అతడి ఒడిలో నిద్రించారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్యూటెస్ట్ ఫొటో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా హార్దిక్, నటాషా విడాకుల అనంతరం అగస్త్య తన పెద్దమ్మ పాంఖురి దగ్గరే ఉంటున్నారు. ఆమెనే ఈ చిన్నారి ఆలనాపాలనా చూస్తున్నారు.
లెబనాన్‌లోని బింట్ జెబీల్ ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థకు చెందిన ముగ్గురు కీలక నేతల్ని వైమానిక దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్‌లో ప్రకటించింది. వారిలో బింట్ జెబీల్ కమాండర్ అహ్మద్ జాఫర్, అతడి తర్వాత కమాండర్ కావాల్సిన వ్యక్తి, ఆర్టిలరీ హెడ్‌లు ఉన్నారని స్పష్టం చేసింది. తమ దేశంపై జరిగిన అనేక దాడుల్లో వీరి ప్రమేయం ఉందని తెలిపింది.
ప్రస్తుతం పని ఒత్తిడితో కొందరు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. కానీ కొన్ని పనులు చేస్తే గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే శారీరక శ్రమ ఏర్పడి బాగా నిద్ర పడుతుంది. సాయంత్రం గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి, గ్లాసు పాలు తాగాలి. అలాగే రాత్రి త్వరగా భోజనం చేయాలి. ఇలా చేస్తే తిన్నవి త్వరగా జీర్ణమై నిద్ర పడుతుంది. రాత్రి కాఫీ, టీ, వైన్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.
Sorry, no posts matched your criteria.