News November 7, 2025

ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిందే: సుప్రీం

image

కారణాలు చెప్పకుండా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకు అరెస్టు చేశారు? FIRలో ఏం రాశారు? ఏ చట్టాలను ప్రస్తావించారో నిందితులకు చెప్పాలని తేల్చి చెప్పింది. ‘అరెస్టుకు ముందు లేదా అరెస్టయిన తక్షణమే కారణాలు చెప్పాలి. 2 గంటల్లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగలిగితే ఇది వర్తించదు’ అని తెలిపింది. తన అరెస్టుకు కారణాలు చెప్పలేదంటూ మిహిర్ రాజేశ్(ముంబై) వేసిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది.

News November 7, 2025

40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

image

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిల‌గ‌డదుంప‌లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News November 7, 2025

పనులు ఆపేస్తాం.. ప్రభుత్వానికి బిల్డర్ల అల్టిమేటం

image

TG: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.36వేల కోట్ల బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి అన్ని శాఖల పరిధిలో సివిల్ వర్క్స్ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు ఆస్తులను తాకట్టు పెట్టి పనులు చేశారని, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

News November 7, 2025

ఇవాళ ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తోన్న SSMB29 చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.

News November 7, 2025

SECLలో 543 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి. డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు 3ఏళ్ల అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://secl-cil.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి

News November 7, 2025

సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News November 7, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్‌లో 50 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/

News November 7, 2025

నైట్ షిఫ్ట్ ఒత్తిడి తట్టుకోలేక 10 మందిని చంపేసిన నర్సు!

image

నైట్ షిఫ్టులతో విసుగు చెందిన ఓ నర్సు (Male) హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి 10 మందిని చంపిన ఘటన జర్మనీలోని వుయెర్సెలెన్ ఆసుపత్రిలో జరిగింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా చేసినట్లు అతడు ఒప్పుకోవడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడు మరో 27 మందిని హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. కాగా గతంలో నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా 85 మందిని హత్య చేశాడు.

News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?