News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?

News November 7, 2025

బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.

News November 7, 2025

దాతృత్వంలో శివ్ నాడార్ అగ్రస్థానం

image

ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో శివ్ నాడార్(HCL టెక్నాలజీస్) ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708Cr విరాళం ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ వెల్లడించింది. గత ఐదేళ్లలో 4సార్లు ఆయన టాప్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ముకేశ్(₹626Cr), బజాజ్(₹446Cr), బిర్లా(₹440Cr), అదానీ(₹386Cr), నందన్(₹365Cr), హిందూజ(₹298Cr), రోహిణి(₹204Cr) ఉన్నారు. మొత్తంగా 191 మంది కుబేరులు ₹10,380Cr ఇచ్చారు.

News November 7, 2025

విద్యార్థులు తప్పక ఉచ్ఛరించాల్సిన 12 నామాలు

image

1.ఓం భారతి నమ:, 2.ఓం సరస్వతి నమ:,
3.ఓం శారదే నమ:, 4.ఓం హంసవాహినియే నమ:,
5.ఓం జగతే నమ:, 6.ఓం వాగేశ్వరి నమ:,
7.ఓం కుముదినే నమ:, 8.ఓం బ్రహ్మచారిణే నమ:,
9.ఓం బుద్ధిదాత్రే నమ:, 10.ఓం చంద్రకాంతే నమ:,
11.ఓం వార్దాయని నమ:, 12.ఓం భువనేశ్వరి నమ:
విద్యార్థులు రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ 12 నామాలను ఉచ్ఛరిస్తే జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, విద్య, కళలు, సృజనాత్మకత పెరుగుతాయని నమ్మకం.

News November 7, 2025

HCUలో 52 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో 52 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/

News November 7, 2025

ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు(1/2)

image

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర కిలో

News November 7, 2025

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం(2/2)

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.

News November 7, 2025

త్వరలో 2,837 కంప్యూటర్​ టీచర్​ జాబ్స్​!

image

TG: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ITలో శిక్షణ ఇచ్చేందుకు 2,837 కంప్యూటర్ టీచర్లను (ICT Instructors) నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. 5 కంప్యూటర్ల కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లలో వీరిని నియమించి, నెలకు రూ.15వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారని సమాచారం. ఔట్‌‌సోర్సింగ్​ ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇప్పటికే CMకు పంపగా, ఆయన ఆమోదం తర్వాత నోటిఫికేషన్ రానుంది.

News November 7, 2025

విటమిన్స్ లోపం-లక్షణాలు

image

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్‌, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.