News November 7, 2025

చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

image

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

News November 7, 2025

హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

image

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

News November 7, 2025

SBI అరుదైన ఘనత

image

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.

News November 7, 2025

చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

image

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

News November 7, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు

image

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

News November 7, 2025

తక్కువ పంటకాలం – రబీకి అనువైన వరి రకాలు

image

రబీ సాగుకు తక్కువ కాలపరిమితి, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలి. అందులో కొన్ని M.T.U 1010(కాటన్ దొర సన్నాలు), M.T.U 1156( తరంగిణి), M.T.U 1153(చంద్ర), M.T.U 1293, M.T.U 1273, M.T.U 1290. వీటి పంటకాలం 120 రోజులు. వీటిలో కొన్ని పొడుగు సన్నగింజ రకాలు. దిగుబడి ఎకరాకు 3-3.2 టన్నులు. చేనుపై పడిపోవు. అగ్గితెగులును తట్టుకుంటాయి.✍️ మరిన్ని వరి రకాలు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 7, 2025

ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి

image

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్‌ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.

News November 7, 2025

మన హాకీకి వందేళ్లు.. పూర్వవైభవం సాధిద్దాం

image

స్వాతంత్య్రానికి ముందే భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన క్రీడ హాకీ. 1925 NOV 7న మన హాకీకి IHF గుర్తింపు లభించింది. ఆ ఘనతకు నేటితో వందేళ్లు. 1926లో తొలి అంతర్జాతీయ పర్యటనకు న్యూజిలాండ్ వెళ్లిన భారత్ 21 మ్యాచుల్లో 18 గెలిచింది. 1958 వరకు వరుసగా ఆరు, 1964, 1980లో ఒలింపిక్స్ స్వర్ణాలు, 1975లో WC సాధించింది. ఆ తర్వాత హాకీ ప్రాభవాన్ని కోల్పోయింది. పదేళ్లుగా పూర్వవైభవం కోసం కృషి జరుగుతోంది.

News November 7, 2025

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

image

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>