News November 7, 2025

ప్రతికూల ఆలోచనలు పక్కన పెట్టండి

image

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్‌ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.

News November 7, 2025

మన హాకీకి వందేళ్లు.. పూర్వవైభవం సాధిద్దాం

image

స్వాతంత్య్రానికి ముందే భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన క్రీడ హాకీ. 1925 NOV 7న మన హాకీకి IHF గుర్తింపు లభించింది. ఆ ఘనతకు నేటితో వందేళ్లు. 1926లో తొలి అంతర్జాతీయ పర్యటనకు న్యూజిలాండ్ వెళ్లిన భారత్ 21 మ్యాచుల్లో 18 గెలిచింది. 1958 వరకు వరుసగా ఆరు, 1964, 1980లో ఒలింపిక్స్ స్వర్ణాలు, 1975లో WC సాధించింది. ఆ తర్వాత హాకీ ప్రాభవాన్ని కోల్పోయింది. పదేళ్లుగా పూర్వవైభవం కోసం కృషి జరుగుతోంది.

News November 7, 2025

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

image

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 7, 2025

తెలంగాణలో యాసంగికి అనువైన వరి రకాలు

image

కూనారం సన్నాలు(KNM-118), కాటన్ దొర సన్నాలు(MTU-1010), రాజేంద్రనగర్ వరి-4(RNR-29325), కూనారం వరి-2(KNM-1638), వరంగల్ వరి-2(WGL-962), కూనారం వరి-1(KNM-733), జగిత్యాల రైస్-1(JGL-24423), WGL 283, JGL 1118, BPT 2615, WGL 505, WGL 20471, JGL 18047, జగిత్యాల సాంబ, JGL 27356, RNR 21278. ఈ రకాల పంట కాలం 120-125 రోజులు. వీటిలో కొన్ని సన్న, దొడ్డు గింజ రకాలున్నాయి. వ్యవసాయ నిపుణుల సూచనలతో వీటిని నాటుకోవాలి.

News November 7, 2025

నాబార్డ్‌లో 91పోస్టులు

image

నాబార్డ్(NABARD) 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA, CA, CS, LLB, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలు రూ.150 చెల్లించాలి. వెబ్‌సైట్: www.nabard.org/

News November 7, 2025

ఎగుమతులే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ సదస్సు

image

AP నుంచి ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో ‘ఏపీ గ్లోబల్ MSME ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ సమ్మిట్’ నిర్వహించనుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రియా, జపాన్, హంగేరీ, ఈజిప్ట్, న్యూజిలాండ్, ఉగాండా, జింబాబ్వేతోపాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని సంస్థలు తయారుచేసే ఉత్పత్తులు, వాటి ఎగుమతుల అవకాశాలను అధికారులు వివరిస్తారు.

News November 7, 2025

అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు

image

AP: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు అలర్ట్. వారికి టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజూ 750 టికెట్లను ఆన్‌లైన్ డిప్ విధానంలో జారీ చేస్తుండగా, ఈ విధానాన్ని రద్దు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో టికెట్లు కేటాయించనుంది. ఇకపై 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది.

News November 7, 2025

సచివాలయాల పేరును మార్చలేదు: CMO

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.

News November 7, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/