News November 7, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/

News November 7, 2025

శ్రీరాముడి విజయం వెనుక సరస్వతీ దేవి

image

రావణుడితో యుద్ధంలో శ్రీరాముడి విజయానికి సరస్వతీ దేవి పరోక్షంగా కారణమయ్యింది. రావణుడితో పాటు బ్రహ్మ దేవుడు కుంభకర్ణుడికి కూడా వరం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో సరస్వతీ దేవి లోక కళ్యాణానికై అతని నాలుకపై చేరి ‘నిద్ర వరం’ అడిగేలా చేసింది. ఈ అతి నిద్ర కారణంగా కుంభకర్ణుడు ఆలస్యంగా రావడంతో రావణ సైన్యం యుద్ధంలో ఓడిపోయింది. ధర్మసంస్థాపన జరిగింది.
☞ ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 7, 2025

రబీ సాగుకు అనువైన మరికొన్ని వరి రకాలు

image

M.T.U 3626 ( ప్రభాత్), M.T.U 1121( శ్రీ ధృతి), M.T.U.1282, M.T.U.1290, N.L.R 34449(నెల్లూరు మషూరి – మిక్కిలి సన్నగింజ రకం), N.L.R 3354( నెల్లూరు ధాన్య రాశి), N.L.R 40054(నెల్లూరు సుగంధ) ఈ వరి రకాలు కూడా రబీ సాగుకు అనుకూలమే. వీటి పంట కాలం 120 నుంచి 125 రోజులు. వీటిలో చాలావి మధ్యస్త సన్నం, సన్న గింజ రకాలే. ఇవి చేనుపై పడిపోవు. అగ్గి తెగులును తట్టుకుంటాయి. నిపుణుల సూచనలతో వీటిని విత్తుకోండి.

News November 7, 2025

ఓపిక ఉండట్లేదా?

image

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.

News November 7, 2025

శుక్రవారం ఈ పని చేయకూడదా..?

image

శుక్రవారం రోజున దేవతా విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతారు. ‘శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇలాంటి కార్యాలు చేపడితే ఆ దేవత ఆగ్రహించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఈ పనులు కారణమవుతాయి. అందుకే శుక్రవారం రోజున ఇలా చేయకూడదు. దేవుడి విగ్రహాలు, పటాల శుభ్రతకు బుధ, గురు, ఆది, సోమవారాలు అనుకూలం’ అని అంటారు.

News November 7, 2025

నేడు స్పీకర్ విచారణకు జగదీశ్ రెడ్డి, సంజయ్

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మలిదశ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ ప్రసాద్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని, అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల MLA సంజయ్‌పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్‌పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.

News November 7, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్‌పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన

News November 7, 2025

APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

image

చెన్నై ఆవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 5 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ(CS)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు 300, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 7, 2025

రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

image

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.

News November 7, 2025

DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

image

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్‌వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.