News April 12, 2025

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు గాను తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. AP CM చంద్రబాబు దీనికి సంబంధించి మొదటి అడుగు వేసే ఆలోచనలో ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, రేవంత్ గత ఏడాది జులైలో ప్రజాభవన్‌లో తొలిసారి సమావేశమైనా చాలా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. వాటన్నింటిపై ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

News April 12, 2025

టెట్ దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

image

TG: ఈ నెల 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించింది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదే నెల 15-30 మధ్య రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు జులై 22న వెల్లడిస్తారు.

News April 12, 2025

తహవూర్‌ను తీసుకొచ్చిన జెట్ అద్దె రూ.4 కోట్లు

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాను US నుంచి తీసుకొచ్చేందుకు NIA గల్ఫ్ స్ట్రీమ్ G550 జెట్‌ను ఉపయోగించింది. ఆగకుండా 12,500KM ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు. ఈ జెట్ విలువ దాదాపు రూ.500-600కోట్లు కాగా భారత్ రూ.4 కోట్లు రెంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. విశాలమైన క్యాబిన్లు, పటిష్ఠ భద్రత కలిగిన ఈ విమానాన్ని ప్రభుత్వాధినేతలు, బిలియనీర్లు ఎక్కువగా వినియోగిస్తారు.

News April 12, 2025

నేడూ పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కూడా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఉదయం ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఇవాళ రెండో శనివారం అధికారులకు సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

News April 12, 2025

ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHని ఆపడం కష్టం: వెటోరీ

image

దూకుడుగా ఆడితేనే SRH ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుందని ఆ జట్టు కోచ్ వెటోరీ తెలిపారు. ‘మా బ్యాటర్లకు ఎలాంటి బంతులేయాలన్నదానిపై ఇతర జట్లు పూర్తి ప్లాన్‌తో వస్తున్నాయి. ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHను ఆపడం ఇక కష్టం. ఎవరో ఇద్దరు ఎదురు దాడి మొదలుపెడితే మిగిలినవారికీ ఆ దూకుడు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

News April 12, 2025

విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజుజయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

News April 12, 2025

IPL: ఈరోజు డబుల్ బొనాంజా

image

ఈరోజు వీకెండ్ కావడంతో ఐపీఎల్‌లో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు లక్నోలో LSG vs GT.. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో SRH, PBKS తలపడనున్నాయి. సీజన్ మధ్య దశలోకి వస్తుండటంతో అన్ని జట్లూ విజయం కోసం ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచులూ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచుల్లో ఎవరు గెలవొచ్చు? కామెంట్ చేయండి.

News April 12, 2025

సంచలన తీర్పు: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

image

TG: సొంత కూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోతే మండలంలోని మేకపాటి తండాకు చెందిన ఓ మహిళ, మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసింది. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

News April 12, 2025

హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌పై కీలక నిర్ణయం

image

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్‌ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

News April 12, 2025

దక్షిణాఫ్రికా ఆటగాడిపై PSLలో నిషేధం

image

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్‌పై పాకిస్థాన్ సూపర్ లీగ్ నిషేధం విధించింది. ఈ ఏడాది టోర్నీ కోసం పెషావర్ జల్మీ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో అతడి రీప్లేస్‌మెంట్‌గా కార్బిన్‌ను MI తీసుకుంది. ఈ నేపథ్యంలో PSL నుంచి కార్బిన్ వైదొలిగారు. దీంతో వచ్చే ఏడాదికి కార్బిన్‌ను నిషేధిస్తున్నట్లు PSL యాజమాన్యం ప్రకటించింది.