News April 11, 2025

అమెరికాపై 125% టారిఫ్ విధించిన చైనా

image

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికాకు కౌంటర్‌గా చైనా సుంకాలు పెంచింది. నిన్న చైనా ఉత్పత్తులుపై అమెరికా 145% టారిఫ్ విధించగా ఇవాళ చైనా 125% సుంకం విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బెదిరించాలని చూస్తున్నారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

News April 11, 2025

అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

image

AP: దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పెన్షన్లు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద అర్హులైన వారికి రూ.15వేలు అందిస్తామన్నారు. మే నుంచి రైతులకు విడతల వారీగా రూ.20వేలు(కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి) ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

News April 11, 2025

నన్నే మోసం చేస్తున్నారు.. మీరో లెక్కా: చంద్రబాబు

image

AP: సీఎంనైన తననే మోసం చేస్తున్నారని వడ్లమాను సభలో CM చంద్రబాబు తెలిపారు. ‘CMగా ఉన్నప్పుడు ఓరోజు ఉదయం లేచేసరికి YS వివేకానంద గుండెపోటుతో మరణించారని చెప్పారు. కానీ అది గుండెపోటు కాదు.. గొడ్డలివేటు. ఆ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్కా. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ఈ రోజుల్లో వారిని సమర్థంగా ఎదుర్కోవాలి కదా?’ అని అన్నారు.

News April 11, 2025

ట్రంప్ తీరు బెదిరింపు చర్యలా ఉంది: జిన్‌పింగ్

image

ట్రంప్ తమ దేశంపై విధించిన అధిక సుంకాలు బెదిరింపు చర్యలా ఉన్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అధిక టారిఫ్‌లను ఎదుర్కొవడానికి EU తమతో కలిసిరావాలని కోరారు. చైనా,యూరప్ దేశాలకు అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ఇబ్బందులను ప్రతిఘటించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలా చేయడం వల్ల తమ హక్కుల్ని రక్షించుకోవడంతో పాటు ప్రపంచానికి న్యాయం చేసినట్లు ఉంటుందని జిన్‌పింగ్ తెలిపారు.

News April 11, 2025

శ్రీధర్ బాబు సీఎం పదవికి అర్హుడే.. కానీ: అర్వింద్

image

TG: సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబుకు సీఎం అయ్యే అర్హత ఉందన్నారు. కానీ ఆయనకు వసూలు చేయడం రాదని, అందుకే హైకమాండ్ వెనక్కి తగ్గుతోందని అర్వింద్ ఎద్దేవా చేశారు.

News April 11, 2025

వారికి అదే చివరిరోజు.. CM చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

image

AP: సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని CM చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు(D) వడ్లమాను సభలో ఆయన మాట్లాడారు. ‘SM నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవడైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి. మీకు చేతనైతే విలువలు నేర్పించండి’ అని చంద్రబాబు హితవు పలికారు.

News April 11, 2025

గోశాలలో ఆవులు మృతి చెందలేదు: TTD

image

తిరుమల గోశాలలో వందల ఆవులు <<16061861>>మృతి చెందాయని <<>>జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తేల్చి చెప్పింది. దురుద్దేశంతో కొందరు మృతి చెందిన గోవుల ఫొటోలను పోస్ట్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది.

News April 11, 2025

చెన్నైలో షా.. TN BJP అధ్యక్షుడి ప్రకటన నేడే!

image

తమిళనాడు BJPకి ఇవాళ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చెన్నైలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా స్థానిక నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన చెన్నై బయల్దేరారు. దీంతో నూతన అధ్యక్షుడిని షా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఇటీవల అన్నామలై ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 11, 2025

గుండుతో ప్రముఖ నటి లుక్ వైరల్

image

భాను ప్రియ సోదరి, నటి శాంతి ప్రియ గుండుతో ఉన్న ఫొటోలు వైరలవుతున్నాయి. అందానికి కొత్త నిర్వచనం ఇవ్వడంతోపాటు కొన్ని పరిమితుల నుంచి స్వేచ్ఛను పొందేందుకే ఇలా చేసినట్లు ఇన్‌స్టాలో తెలిపారు. చనిపోయిన తన భర్త సిద్ధార్థ్ రాయ్ జ్ఞాపకంగా ఆయన బ్లేజర్ ధరించానన్నారు. ఈమె తెలుగులో మహర్షి, కాబోయే అల్లుడు, నాకు పెళ్లాం కావాలి, సింహ స్వప్నం, అగ్ని, శిలా శాసనం, కలియుగ అభిమన్యుడు తదితర చిత్రాల్లో నటించారు.

News April 11, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 10.36 లక్షల స్కూళ్లలోని 11.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రైమరీ విద్యార్థులకు 0.59 పైసలు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 0.88 పైసలు పెంచింది. దీంతో ఒక్కో విద్యార్థికి 20 gms పప్పులు, 50gms కూరగాయలు, 5gms నూనెతో ఆహారం అందించొచ్చు.