News April 10, 2025

రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

image

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

News April 10, 2025

కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

image

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.

News April 10, 2025

KOHLI: మరో 2 బౌండరీలు బాదితే చరిత్రే

image

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరో 2 బౌండరీలు బాదితే IPLలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో ధవన్(920), డేవిడ్ వార్నర్(899), రోహిత్ శర్మ(885) ఉన్నారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.

News April 10, 2025

గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలను A, B, C కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు, 2501-3500 జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు, 3501కి పైగా జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్‌లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.

News April 10, 2025

ALERT: పరీక్ష తేదీ మార్పు

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్ష తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో పరీక్షను మరుసటి రోజు 21కి మార్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని విద్యాశాఖ సూచించింది. www.cse.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News April 10, 2025

‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

image

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీతో వింటేజ్ రవితేజను చూపిస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

News April 10, 2025

ఆ రైతులకు త్వరలోనే నష్టపరిహారం: మంత్రి తుమ్మల

image

TG: మార్చిలో కురిసిన వడగళ్ల వానకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే రైతులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ నెల 3-9 వరకు రాష్ట్రంలో వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదిక అందిందని వెల్లడించారు.

News April 10, 2025

OFFICIAL: పూరీ-సేతుపతి సినిమాలో టబు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఒక డైనమిక్ క్యారెక్టర్ కోసం ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2025

దారుణం: పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష

image

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూలులో అమానుష ఘటన జరిగింది. పీరియడ్స్ వచ్చాయనే కారణంతో 8వ తరగతి బాలికను క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి ప్రిన్సిపల్ 2 రోజులు పరీక్షలు రాయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి స్కూల్‌కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఇలా చేయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News April 10, 2025

యమగూచి చేతిలో ఓడిన సింధు

image

జపాన్ బ్యాడ్మింటన్ సంచలనం యమగూచి మరోసారి పీవీ సింధుకి షాక్ ఇచ్చారు. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 21-12, 16-21, 21-16 తేడాతో సింధును ఓడించారు. మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ రాజావత్‌ను 21-14, 21-17 తేడాతో జపాన్ ఆటగాడు కొడాయ్ నరవొక మట్టికరిపించారు. దీంతో సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది.