News April 10, 2025

అమెరికాపై ఐరోపా 23 బిలియన్ డాలర్ల సుంకాలు

image

అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఐరోపా సమాఖ్య 23 బిలియన్ డాలర్ల టారిఫ్‌లను అమెరికా ఉత్పత్తులపై విధించింది. వీటిని దశలవారీగా అమలుచేస్తామని తెలిపింది. ఈ నెల 15 నుంచి మొదటి దశ ప్రారంభమవుతుందని పేర్కొంది. మే 15న రెండో దశ, డిసెంబరు 1న మూడో దశ ఉంటుందని తెలిపింది. ట్రంప్ సుంకాలపై 90రోజుల వ్యవధి ఇవ్వకముందు ఈయూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

News April 10, 2025

ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం

image

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యాసంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది. కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.

News April 10, 2025

దేశ ఎగుమతుల్లో 6 శాతం వృద్ధి

image

దేశ ఎగుమతులు FY25లో $820బిలియన్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. FY24($778 బిలియన్లు)తో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ఇందులో వస్తు ఎగుమతులు $395.63 బిలియన్లు, సేవల ఎగుమతులు $354.90 బిలియన్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఎర్ర సముద్రంలో సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ వివాదం గల్ఫ్‌కు విస్తరించడంతో కొన్ని దేశాల్లో వృద్ధి నెమ్మదించినా భారత్ తన అంచనాలను అధిగమించినట్లు వివరించింది.

News April 10, 2025

దుమ్మురేపుతున్న గుజరాత్ టైటాన్స్!

image

గుజరాత్ టైటాన్స్ కోచింగ్‌లో పెద్దగా హడావిడి ఉండదు. యజమానులూ కనిపించరు. పేపర్‌పై చూస్తే 5 మ్యాచులు గెలిచినా గొప్పే అన్నట్లుండే ఈ జట్టు గ్రౌండ్‌లోకి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. బట్లర్, గిల్, రషీద్, సిరాజ్ తప్పితే స్టార్లు లేని GT రూథర్‌ఫోర్డ్, సుదర్శన్, తెవాటియా వంటి బ్యాటర్లు, ప్రసిద్ధ్, ఇషాంత్, సాయి కిశోర్ వంటి బౌలర్లతోనే దుమ్మురేపుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది.

News April 10, 2025

నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

image

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్‌. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్‌’ అని RGV పేర్కొన్నారు.

News April 10, 2025

15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

News April 10, 2025

నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

image

ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన తహవూర్ రాణాను నేడు భారత్‌కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. అనంతరం NIA రాణాను తమదైన శైలిలో లోతుగా విచారించనుంది. 26/11 ముంబై దాడుల్లో 166 మందిని రాణా సహా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.

News April 10, 2025

కంచ గచ్చిబౌలికి నేడు ‘సుప్రీం’ కమిటీ సందర్శన

image

TG: సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ నేడు కంచ గచ్చిబౌలి భూముల్ని సందర్శించనుంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కమిటీ సభ్యులు తాజ్ కృష్ణలో బసచేశారు. ఈరోజు ఉదయం 10గంటలకు వీరు హెచ్‌సీయూకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వాధికారులతో కమిటీ సమావేశం కానుంది.

News April 10, 2025

IPL: ఈరోజు బెంగళూరుతో ఢిల్లీ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు బెంగళూరులో ఆర్సీబీ, ఢిల్లీ తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో డీసీ రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో నేటి పోరు హోరాహోరీగా జరగొచ్చు. డీసీ హ్యాట్రిక్స్ విన్స్‌తో ఉండగా ఆర్సీబీ ఓడుతూ, గెలుస్తూ వస్తోంది. ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.

News April 10, 2025

రాజీవ్ యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

image

TG: నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 9.5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14న తుదిగడువు కాగా ఆలోపు దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు.