News April 9, 2025

బంగ్లాదేశ్‌కు భారత్ దెబ్బ

image

బంగాళాఖాతానికి తామే పరిరక్షకులం అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశానికి ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఇక నుంచి భారత రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలను వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పోటీ తగ్గి భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

News April 9, 2025

కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి హత్య

image

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని గయాలో భర్త రమేశ్ నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి ఇంకా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 9, 2025

SMలో మహిళలకు వేధింపులు.. CMకు విజయశాంతి విజ్ఞప్తి

image

సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ మహిళలకు బాధను, పనిచేయలేని పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహిళలు చేసే కంప్లైంట్‌పై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా అరెస్టులు, ఇతర చర్యలు తీసుకున్నట్లయితే మహిళా లోకానికి ఆత్మస్థైర్యం, విశ్వాసం లభిస్తుంది’ అని సీఎం రేవంత్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు.

News April 9, 2025

పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు.. కీలక నిర్ణయం

image

AP: పంచాయితీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసింది. MPDO కార్యాలయాల్లోని పంచాయతీ విస్తరణ అధికారుల క్యాడర్‌ను డిప్యూటీ MPDOగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత జగన్ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు MPDO పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేపట్టారని, ఇక నుంచి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.

News April 9, 2025

మహావీర్ జయంతి: రేపు ఐచ్ఛిక సెలవు

image

రేపు మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ (ఐచ్ఛిక) హాలిడే ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు సైతం హాలిడే ఉండనుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సైతం సెలవు ప్రకటించారు (ఏపీ, తెలంగాణలో లేదు). 24వ తీర్థంకరుడైన భగవాన్ మహావీర్ జన్మదినాన్ని మహావీర్ జయంతిగా జరుపుకుంటారు. ఈయన జైన మత విస్తరణకు విశేష కృషి చేశారు.

News April 9, 2025

అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు: రేణు దేశాయ్

image

పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్‌షిప్‌కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15yrs. బహుశా ఆమెకు 18yrs వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు.

News April 9, 2025

అమెరికా ఆధిపత్యాన్ని సహించం: చైనా

image

అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై చైనా మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ‘భారీగా టారిఫ్స్ విధిస్తూ అమెరికా మాపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ఆధిపత్య ధోరణిని మేం సహించబోం. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపితే మంచిది. లేదంటే మేం కూడా అలాగే వ్యవహరిస్తాం’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. USపై విధించే టారిఫ్‌ను చైనా తాజాగా 84%కి పెంచడం తెలిసిందే.

News April 9, 2025

MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

image

మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘ప్రజెంట్ సర్/మేడమ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా కూడా దీనిపై ప్రకటన చేసినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కాగా, హరియాణా ప్రభుత్వం కూడా విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్‌’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకుంది.

News April 9, 2025

ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి: KTR

image

పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేఖ రాశారు. ‘ఇంధన ధరలు పెంచి మరోసారి ప్రజల వెన్ను విరిచేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాల్లోకెల్లా చమురు, LPG ధరలు INDలోనే ఎక్కువ. ముడి చమురు ధరలు అత్యల్ప స్థాయికి పడిపోతే ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పండి. ధరల పెంపును ఉపసంహరించుకోవాలని BRS డిమాండ్ చేస్తోంది’ అని KTR ట్వీట్ చేశారు.

News April 9, 2025

ట్రంప్ నిర్ణయం దెబ్బకొడుతుందా?

image

అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని US ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం. అయితే USలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయి. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టం. మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.