India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
ట్రంప్ టారిఫ్స్ ప్రకటన సెల్ఫ్ గోల్ అని, ఇది అమెరికా ఎకానమీని దెబ్బతీస్తుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. US, చైనా మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే భారత్‌కు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘US, చైనా, జపాన్ తదితర దేశాలతో చర్చలు జరపాలి. చైనాను వీడాలనుకునే కంపెనీలను ఆకర్షించాలి. దిగుమతులపై టారిఫ్స్ తగ్గించాలి’ అని సూచించారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) నిన్న అర్ధరాత్రి మరణించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర అగ్ర నటులతో సినిమాలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.
AP: దేశానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని APCC అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. అహ్మదాబాద్‌లో AICC సమావేశాల సందర్భంగా ఆమె బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీ చేసేవే మత రాజకీయాలు. దేశ ప్రజల్ని విభజించి పాలించడమే ఆ పార్టీకి తెలుసు. మతం పేరిట మంట పెట్టి చలి కాచుకుంటోంది. వ్యవస్థల్ని సొంత అవసరాలకు వాడుకుంటోంది. కాంగ్రెస్‌తోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యం. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం’ అని పేర్కొన్నారు.
AP: FY25లో 1.17L హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్-1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.16L హెక్టార్లు), UP(1.02L హె,), కర్ణాటక(97K హె,) TN(91K హె,) ఉన్నాయి. బిందు, తుంపర్ల పరికరాల కోసం కేంద్రం, AP ప్రభుత్వాలు, రైతులు కలిసి ₹1,176Cr వెచ్చించారు. దేశంలో ఈ పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఉన్నాయి.
వ్యాపారాల్లో ఉన్నట్లుగానే వివాహ బంధంలోనూ భార్యాభర్తలు సమీక్ష చేసుకోవాలని మెగా కోడలు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఇద్దరికీ మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. బంధంలో ఎత్తుపల్లాలన్నవి సహజం. ఆ సమయంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారన్నది ముఖ్యం. మేం వారానికి ఒకరోజైనా ఒకరికొకరు పూర్తి సమయాన్ని కేటాయించుకుంటాం. సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుంటాం. అదే మా సీక్రెట్’ అని తెలిపారు.
AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
AP: CM చంద్రబాబు నేడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు ఆయన కుటుంబీకులతో కలిసి భూమిపూజలో పాల్గొననున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఈ-9 రోడ్డులో 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం జరగనుంది. ఓ రైతు నుంచి ఆ భూమిని కొనుగోలు చేశారు. భూమి చదును పనులు నిన్నటికి పూర్తయ్యాయి. జీ ప్లస్ వన్‌గా ఇంటిని నిర్మిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోపే గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.
వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. VFX పనులను త్వరగా పూర్తి చేసి జులై 24న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. 2002లో ఇంద్ర సినిమా ఇదే తేదీన రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.
IPL: పంజాబ్‌తో నిన్నటి మ్యాచ్‌లో CSK పోరాడి ఓడిన విషయం తెలిసిందే. 180+ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ల్లో చెన్నైకిది వరుసగా 11వ పరాజయం. చివరిసారి 2018లో ఛేజ్ చేసింది. అయితే ఈ 11 మ్యాచ్‌ల్లో CSK కెప్టెన్ గైక్వాడ్ కేవలం ఒక ఫిఫ్టీ కొట్టి 8సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. అతడే వరుస పరాజయాలకు కారణమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా PBKSతో జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో చెన్నై ఒకటే గెలిచింది.
Sorry, no posts matched your criteria.