India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగులుస్తున్నాయి. కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బాపట్ల, ప్రకాశం, అల్లూరి జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. 10వేల ఎకరాల వరి, 3వేల ఎకరాల మొక్కజొన్న, 670 ఎకరాల్లో అరటి, బొప్పాయి, నిమ్మ తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా నష్ట తీవ్రత పెరుగుతోందంటున్నారు.
ఆచరణసాధ్యం కాని షరతులు విధించి క్లెయిమ్స్‌ను ఎగవేయడం సరికాదని బీమా కంపెనీలకు సుప్రీం కోర్టు చురకలంటించింది. షరతుల్ని పాటించలేదన్న పేరుతో బీమా చెల్లింపుల్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. బీమా కంపెనీలు నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొంది. సోహోం షిప్పింగ్ సంస్థకు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థకు మధ్య నడుస్తున్న కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈమేరకు తీర్పునిచ్చింది.
AP: సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఈ నెల 11న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్టకు వెళతారు. కోదండరామ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
అయోధ్యలో వచ్చే నెలలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. దర్బారుకు సంబంధించిన పాలరాతి విగ్రహాలను జైపూర్‌లో శిల్పి ప్రశాంత్ పాండే తీర్చిదిద్దుతున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. పట్టాభిషేకానికి పరిమితంగా మాత్రమే అతిథుల్ని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
బెంగళూరులో ఇద్దరు మహిళల పట్ల ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ‘నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సాధారణమే’ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది వాటిని వక్రీకరించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన మహిళలు నన్ను క్షమించండి. స్త్రీల రక్షణకే నేనెప్పుడూ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాను’ అని వివరణ ఇచ్చారు.
ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లో గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న GT ఈరోజు గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. గత రెండు మ్యాచులూ గెలిచిన రాజస్థాన్ విజయ పరంపరను కొనసాగించి హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని చూస్తోంది. రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.
TG: దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జౌళి శాఖ ప్రకటించింది. ‘ఈ ఏడాది మార్చి 31లోపు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్లను సేకరించింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(30 లక్షలు), గుజరాత్(14 లక్షలు) ఉన్నాయి’ అని వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక ఆంధ్రప్రదేశ్ 4లక్షల బేళ్ల పత్తిని సేకరించింది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు తీసిన నీల్ తమ హీరోను ఎలా చూపిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. వారికి మూవీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్‌డేట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.
Sorry, no posts matched your criteria.