News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్ -చైనా ఏకమవ్వాలి: చైనా

image

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

News April 9, 2025

IPL: చెన్నైకు మరో ఓటమి

image

CSKతో మ్యాచులో 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. ఈ సీజన్‌లో PBKSకు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.

News April 9, 2025

హైదరాబాద్‌కు BYD రానట్లే..!

image

హైదరాబాద్‌కు చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD రాబోతోందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కేంద్రమంత్రి వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలతో ఆ కంపెనీ వచ్చేందుకు అవకాశాల్లేవని స్పష్టమైంది. ప్రస్తుతానికి BYDకి డోర్లు తెరవబోమని ఆయన తేల్చి చెప్పారు. దేశ వ్యూహాత్మక, సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను ఆహ్వానించాల్సి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

News April 9, 2025

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదు: WHO

image

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని, ఎప్పుడైనా సంభవించవచ్చని చెప్పారు. దీనికి 20 ఏళ్లు పట్టొచ్చు లేదా రేపే జరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహమ్మారి ముప్పు మాత్రం ఖాయమని, అది జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

News April 9, 2025

గ్యాస్ ధరల పెంపు.. వారిపై నో ఎఫెక్ట్

image

TG: కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు వర్తించదు. ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తానని ప్రకటించడమే దీనికి కారణం. దీంతో ఈ పెంపు ఎఫెక్ట్ మిగిలిన LPG గ్యాస్ వినియోగదారులపై పడనుంది. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలపై అదనపు భారం పడనుండగా 39 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ధర రూ.905-రూ.928.50కి చేరింది.

News April 8, 2025

అక్రమ వలసదారులకు రోజుకు రూ.86వేల జరిమానా?

image

USAలో అక్రమ వలసదారులు ‘ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ’ నుంచి ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం నుంచి వెళ్లకుంటే, రోజుకు 998 డాలర్లు జరిమానా విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.86వేలు. సెల్ఫ్ డిపోర్టేషన్ చేయకుండా అక్రమ వలసదారులు పట్టుబడితే డబ్బు స్వాధీనం చేసుకోవడంతో పాటు దేశంలోకి రాకుండా శాశ్వత బహిష్కరణకు DHS ఆదేశించింది.

News April 8, 2025

భారత జట్టుకు ఎంపికైన ఆంధ్రా అమ్మాయి.. అభినందించిన సీఎం

image

ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఎన్.శ్రీ చరణి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. SL, SAతో వన్డే ట్రై సిరీస్ ఆడే టీమ్‌లో ఆమె చోటు దక్కించుకున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చరణి రాష్ట్రాన్ని గర్వపడేలా చేశారని, ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ X వేదికగా అభినందనలు తెలిపారు. క్రికెట్‌లో ఆమె జర్నీ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

News April 8, 2025

షూటింగ్ వరల్డ్ కప్: భారత్ ఖాతాలో 5 మెడల్స్

image

అర్జెంటీనా రాజధాని బ్వేనోస్ ఐరిస్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ ఇప్పటివరకు 5 మెడల్స్(3 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్) సాధించింది. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 18ఏళ్ల సురుచి ఫొగట్ స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు ఒలింపిక్ మెడల్స్ విజేత మను భాకర్ ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అత్యధిక మెడల్స్ గెలిచిన దేశాల్లో చైనా(7) తొలి స్థానంలో ఉండగా IND రెండో స్థానంలో ఉంది.

News April 8, 2025

IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల్లో)

image

30 – క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 – యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై, 2010
38 – డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 – ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 – ప్రియాంశ్ ఆర్య (అన్‌క్యాప్డ్ ప్లేయర్) (PBKS) vs CSK, ముల్లన్‌పూర్, 2025*

☞ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో ప్రియాంశ్ రెండో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ ఉన్నారు.

News April 8, 2025

ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.