News April 8, 2025

ఒక్క మ్యాచ్‌కే రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ విల్ పుకోవిస్కీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విల్ అనూహ్యంగా రిటైర్ కావడం చర్చనీయాంశంగా మారింది. 2021లో భారత్‌పైనే విల్ టెస్టు అరంగేట్రం చేశారు. కానీ గతేడాది ఓ మ్యాచ్‌లో అతడి తలకు బంతి బలంగా తాకడంతో కుప్పకూలాడు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా అతడు క్రికెట్ ఆడే పరిస్థితులు లేవని మెడికల్ ప్యానెల్ నిర్ధారించింది.

News April 8, 2025

IPL: టాస్ గెలిచిన కేకేఆర్

image

ఐపీఎల్‌లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
LSG: మార్ష్, మార్క్‌రమ్, పూరన్, పంత్ (C), బదోని, మిల్లర్, సమద్, శార్దూల్, ఆకాశ్, దిగ్వేశ్, అవేశ్.
KKR: డికాక్, నరైన్, రహానే(C), అయ్యర్, జాన్సన్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, వైభవ్, రాణా, చక్రవర్తి.

News April 8, 2025

రేవంత్, కేటీఆర్ ప్రాణమిత్రులు: బండి సంజయ్

image

TG: CM రేవంత్, KTR ప్రాణ మిత్రులని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే కేటీఆర్ అరెస్ట్ కాకుండా CM కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘రేవంత్, KTR కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరూ కలిసే వెళ్లారు. HYD సమావేశం కూడా వీరే నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి BJPని దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారు’ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

News April 8, 2025

రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్, వాకింగ్ బ్రిడ్జిలకు ప్రముఖ ముంబై క్రికెటర్ల పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) భావిస్తోంది. ఓ స్టాండ్‌‌కు రోహిత్ శర్మ పేరిట నామకరణం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్లేయర్స్ అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, శివాల్కర్, డయానా ఎడుల్జీ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

News April 8, 2025

వేసవి సెలవుల్లోనూ ఇంటర్ క్లాసులు

image

TG: సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దన్న ఇంటర్ బోర్డు ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. బ్రిడ్జి కోర్సు పేరుతో ఫస్టియర్ విద్యార్థులకు, ఐఐటీ, నీట్ అంటూ సెకండియర్ విద్యార్థులకు సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా మార్చి 30తో పరీక్షలు ముగియగా, జూన్ 1 వరకూ ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇచ్చారు.

News April 8, 2025

SA స్టార్ ప్లేయర్ క్లాసెన్‌కు షాక్

image

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు క్లాసెన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(CSA) షాకిచ్చింది. బోర్డ్ విడుదల చేసిన 18మంది ఆటగాళ్ల 2025-26 కాంట్రాక్ట్‌ లిస్ట్‌‌‌లో క్లాసెన్ పేరు లేదు. ఇది ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ICC ఈవెంట్స్, కీలక సిరీస్‌ల్లో పాల్గొనేలా మిల్లర్, డసెన్‌కు హైబ్రిడ్ కాంట్రాక్ట్ కల్పించింది. కాగా SRH స్టార్ ప్లేయర్ క్లాసెన్‌పై IPL తర్వాత CSA తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

News April 8, 2025

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

image

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

News April 8, 2025

శ్రీలీలతో డేటింగ్.. బాలీవుడ్ హీరో ఏమన్నారంటే?

image

కుర్ర హీరోయిన్ శ్రీలీలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. తన గురించి వస్తున్న కథనాలపై స్పందించేందుకు చిత్ర పరిశ్రమలో బంధువులెవరూ లేరన్నారు. ప్రస్తుతం ఈ హీరో శ్రీలీలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.

News April 8, 2025

ఇలా చేయడానికి సిగ్గుందా?: YS జగన్

image

AP: లింగమయ్య హత్య ఘటనలో 20 మందికి పైగా పాల్గొంటే, ఇద్దరిపైనే కేసులు పెడతారా? అని YS జగన్ ప్రశ్నించారు. ‘బేస్ బాల్ బ్యాట్, కత్తులు, కట్టెలతో దాడి చేశారు. బ్యాట్‌తో చేసిన దాడిలో లింగమయ్య చనిపోయారు. ఇది న్యాయమా? ధర్మమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలకు చేయడానికి సిగ్గుందా? హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కొడుకుపై కేసులు పెట్టరా?ఉండవా?’ అని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

News April 8, 2025

RCB కెప్టెన్‌కు జరిమానా

image

IPL: MIతో నిన్న జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. మొదటిసారి కావడంతో రూ.12 లక్షల ఫైన్ వేసింది. కాగా కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే రజత్ రాణిస్తున్నారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించారు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. అతడు జట్టును కూల్‌గా ముందుండి నడిపిస్తున్నారని తాజాగా గవాస్కర్ ప్రశంసించారు.