India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘జగన్‌కు నా అనేవాళ్లు పేదలు. చంద్రబాబుకు నా అనేవాళ్లు నాన్ లోకల్స్ అయిన TV5, ABN, ఈనాడు, దత్తపుత్రుడు. వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

AP: విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. కొవ్వూరు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. వైసీపీ డీఎన్‌ఏలోనే శవరాజకీయం ఉందని ఆరోపించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని స్వయంగా జగన్ చెల్లే కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షాలతో కూటమిగా వచ్చామని చంద్రబాబు తెలిపారు.

రేపు తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలత ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన మంత్రంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

ఏటా వేసవికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించొచ్చంటున్నారు నిపుణులు. ‘ఈసారి 10-20రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ కానున్న నేపథ్యంలో విద్యుత్, ఆహారం, వ్యాపారం, వడ్డీరేట్లు, GDP వృద్ధిపై ప్రభావం చూపొచ్చు. అధిక ఉష్ణోగ్రతలు పంట దిగుబడిని దెబ్బతీస్తే ఆ ప్రభావం వడ్డీరేట్లపైనా ఉంటుంది. విద్యుత్ కొరత, పరిశ్రమల ఉత్పాదకత తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి’ అని హెచ్చరిస్తున్నారు.

IPL-2024లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ రెహమాన్ CSK టీమ్‌కు ఈనెలాఖరు వరకే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బంగ్లా క్రికెట్ బోర్డు అతనికి ఏప్రిల్ 30 వరకే NOC జారీ చేసింది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగే 5 మ్యాచుల T20 సిరీస్ కోసం అతను BAN జట్టులో చేరనున్నారు. దీంతో మేలో జరిగే IPL మ్యాచులకు దూరం కానున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను 3 మ్యాచుల్లో 7 వికెట్లు తీశారు.

AP: వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధమని CM జగన్ పునరుద్ఘాటించారు. ‘త్వరలో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కొందరు కోర్టుకెళ్లారు. అన్నింటినీ ఎదుర్కొని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేం వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. SC, ST, BC, మైనార్టీలకు అన్ని రంగాల్లో 50 శాతం పదవులు ఇచ్చాం’ అని తెలిపారు.

‘రామాయణం’ మూవీ అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. మాజీ MLA, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమంచి 2014లో చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు.

TG: రాష్ట్రంలో టెస్లా తమ ప్లాంటును ఏర్పాటు చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘2023 డిసెంబర్ నుంచి పెట్టుబడులపై దృష్టి సారించాం. పరిశ్రమలకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. దేశంలో టెస్లా పెట్టుబడులు పెట్టనుందనే అంశంపైనా అధ్యయనం చేస్తున్నాం. మా టీమ్ నిరంతరం ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది’ అంటూ టెస్లా ఫౌండర్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు.

సూర్యుడి ప్రతాపానికి తెలంగాణలో నిప్పులు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉ.11 గంటల నుంచి మ.3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని.. వృద్ధులు, పిల్లలు బయటికి రావొద్దని నిపుణులు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.