India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

అమ్మాయిలు 18, అబ్బాయిలు 21 ఏళ్లు దాటాక వివాహం చేసుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక ఆంతర్యం కూడా ఉంది. వివాహ జీవితం సక్రమంగా సాగాలంటే శారీరక బంధం ఉంటే సరిపోదు. మానసిక, ఆధ్యాత్మిక పరిణతి కూడా చెంది ఉండాలి. పూర్వం యువతీ యువకులు వేదాలనభ్యసించి, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకునేవారట. ఇది ధర్మాన్ని నిలబెట్టి, మోక్ష మార్గానికి బాటలు వేస్తుందని నమ్మకం. <<-se>>#Sanathanam<<>>

‘సువర్ణ రజతం ముక్తా; రాజవర్తం ప్రవాలకం రత్న పంచక మాఖ్యాతం’ అంటే.. బంగారం, వెండి, ముత్యం, వజ్రపు శిల(రాజవర్తం), పగడం(ప్రవాలకం)లను పంచ రత్నాలుగా పరిగణించాలి. ఒకవేళ ఈ ఐదు రత్నాలు దొరకనట్లయితే ‘ఆభావే సర్వ రత్నానాం హేమ సర్వత్ర యోజయేత్’ అన్నట్లు.. వాటి స్థానంలో బంగారాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. అన్ని రత్నాలలోనూ ఉత్తమమైనది. సమస్త కార్యాలకు వినియోగించడానికి అర్హమైనది. అందుకే పసిడికంత ప్రాధాన్యం. <<-se>>#Pooja<<>>

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు స్వల్ప అవకాశముందని HYD IMD పేర్కొంది. తర్వాతి 6 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.

హిందూ ధర్మంలో కొందరు కొన్ని వారాల్లో ఒక పూట భోజనం చేసే వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకపూటే తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.శరీరానికి విశ్రాంతి దొరికి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయుష్షు, శక్తి పెరుగుతాయి. ఎక్కువ పూటలు తినడం అనారోగ్యానికి సంకేతం. అందుకే పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నియమాన్ని పాటించాలంటారు. <<-se>>#Aaharam<<>>

బిడ్డ పుట్టాక తల్లుల్లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఒత్తిడి, చిరాకు, కోపం వంటివి వస్తాయి. ఇప్పుడు బిడ్డను చూసుకునే బాధ్యత తండ్రికీ ఉంటోంది. రాత్రులు నిద్రలేకపోవడం, బాధ్యతలు, ఖర్చులు, ఒత్తిడి, జాబ్ కారణంగా తండ్రుల్లోనూ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి సూసైడ్ థాట్స్ కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తండ్రికీ కుటుంబం నుంచి చేయూత అవసరం అంటున్నారు.

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్‌కు సంబంధించిన వంటి టికెట్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.